స్వీట్ తినాలనిపిస్తే.. నిమిషాల్లో రెడీ అయిపోయే డబుల్ కా మీఠా

Double Ka Meetha: స్వీట్ తినాలనిపిస్తే.. నిమిషాల్లో రెడీ అయిపోయే డబుల్ కా మీఠా.. Sweet అంటే ఇష్టపడే వారు చిటికెలో తయారు చేసుకునే డబల్ కా మీటా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బ్రెడ్ స్లైసెస్ – 10
నెయ్యి లేదా నూనె – తగినంత
నీళ్లు – 250 ml
పాలు – 750 ml
చక్కెర – 1 kg
యాలకులు పొడి – ½ టీ స్పూన్
ఖోవా – 50 గ్రాములు
డ్రై ఫ్రూట్స్ – తగినన్ని
వెర్మిసిల్లి – కొద్దిగా
చరీస్ – గార్నిఫ్ కోసం
కాజు బాదం – టేస్ట్ కోసం

తయారీ విధానం
1.ముందుగా బ్రెడ్ ముక్కలను అంచులను కట్ చేసి చిన్న ముక్కలుగా చేసుకోవలి.

2.బ్రెడ్ డీప్ ఫ్రై చేయడానికి నూనె వేడి చేసి మీడియం ఫ్లేమ్ పై బ్రెడ్ ముక్కలను వేపుకోని ప్లేట్ లోకి తీసుకోవాలి.

3.వేరోక ప్యాన్ లో పాలు,నీళ్లు వేసుకోని మరగనివ్వాలి.

4.పాలు కాస్త చిక్కపడ్డాక అందులోకి చక్కెర యాడ్ చేసుకోవాలి.
5.రెండు మూడు నిమిషాలు కలుపుతూ మరిగించుకోవాలి.

6.ఇప్పుడు అందులోకి యాలకుల పొడి ,చిటికెడు ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి.

7.ఇప్పుడు అందులోకి వేపుకున్న బ్రెడ్ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్ పై పదినిమిషాల పాటు ఉంచాలి.

8.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పదినిమిషాలు చల్లారనివ్వాలి.

9.ఇప్పుడు అందులోకి ఖోవా ,సేమియాను కూడ యాడ్ చేసుకోవాలి.

10.చివరగా డ్రై ఫ్రూట్స్ ,చెర్రీస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top