Foxtail Millet Pongal: ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ అనేది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మనం సాధారణంగా బియ్యంతో పొంగల్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా కొర్రల తో పొంగల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది .
ఎన్నో పోషకాలు ఉన్న కొర్రలతో పొంగల్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. బియ్యంతో వండే పొంగల్ తింటే కాస్త మత్తుగా అనిపిస్తుంది. కానీ కొర్రలతో చేసే పొంగల్ తింటే పొట్టకు హాయిగా ఉంటుంది. కొర్రలను వండటానికి ముందు కనీసం నాలుగు గంటల పాటు నాన పెట్టాలి.
కావలసిన పదార్థాలు
ఒక కప్పు కొర్రలు
ఒక కప్పు పెసరపప్పు
ఒక స్పూన్ మిరియాలు
రెండు రెబ్బల కరివేపాకు
పావు స్పూన్ ఇంగువ
ఒక స్పూన్ జీలకర్ర
1/4 కప్పు నెయ్యి
సాల్ట్ తగినంత
తయారీ విధానం
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి పెసరపప్పును వేసి తక్కువ పంట మీద మంచి వాసన వచ్చేవరకు వేగించాలి. కుక్కర్ లో నానిన కొర్రలు,పెసరపప్పు, నీటిని పోసి ఉడికించాలి. ఆ తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికిన కొర్రల మిశ్రమమును బాగా కలపాలి.
మూకుడులో నూనె వేసి జీడిపప్పు, మిరియాలు, కరివేపాకు, ఇంగువ, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఈ తాలింపును ఉడికిన కొర్రల మిశ్రమంలో కలపాలి. వారంలో కనీసం రెండుసార్లు కొర్రల పొంగల్ తింటే చాలా మంచిది.


