Sweet Poha Recipe: అటుకులతో చేసే రెసిపీస్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. తయారు చేసుకోవడం కూడ స్పీడ్ గా అవుతుంది. చిటికెలో తయారు చేసుకునే పోహా స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
అటుకులు – 2 కప్పులు
తురిమిన కొబ్బరి - 1 కప్పు
బెల్లం – 1 కప్పు
యాలకులు పొడి – కొద్దిగా
నువ్వులు – 2 టీ స్పూన్స్
డ్రై ఫ్రూట్స్ – తగినన్ని
తయారీ విధానం
1.ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లోకి కొబ్బరి,బెల్లం తురుము ఉండలు లేకుండా తీసుకోవాలి.
2.రెండింటిని మిక్స్ చేసుకోని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3.బెల్లం కరిగి కొబ్బరి తో కలిసిపోతుంది.
4.ఇప్పుడు వేరొక బౌల్ లో అటుకులు తీసుకోని కొద్దిగా నీళ్లను చిలకరించుకోని కలుపుకోవాలి.
5.తడిఅటుకుల వల్ల బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది.
6.ఇప్పుడు పక్కన పెట్టుకున్న బెల్లం,కొబ్బరి మిశ్రమం లోకి యాలకుల పొడి ,బటర్ తడిపొడిగా కలిపిన అటుకులను వేసి చేతులతో కలుపుకోవాలి.
7.అందులోకి నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి.
8.అంతే స్వీట్ పోహా రెడీ.
