Migraine headache in telugu:మైగ్రేన్ త‌ల‌నొప్పికి కార‌ణాలు.. లైట్ తీసుకుంటే రిస్క్ త‌ప్ప‌దు

Migraine headache in telugu:మైగ్రైన్ అనేది నరాలకు సంబందించిన ఒక రకం తలనొప్పి. నొప్పి తలకు ఒక వైపు మొదలై రెండో వైపుకు వ్యాపిస్తుంది. తలనొప్పితో పాటు కళ్ళు తిరగటం, వాంతి వచ్చినట్టు అన్పించటం,వెలుతురు వైపు చూడలేకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. 

చాలా సందర్భాల్లో వాంతి అయ్యాక తలనొప్పి తగ్గిపోతుంది. ఇలాంటి మైగ్రైన్ తలనొప్పి వారానికో,నెలకో ఒకసారి వచ్చి ఒకటి రెండు రోజులు భాదించి అలా వెళ్ళిపోతుంది. ఇలా పూర్తిగా తగ్గిన నొప్పి మరల నిర్ణీత సమయానికే రావటం దీని ప్రత్యేకత.

తలలోని రక్త నాళాలు అకస్మాత్తుగా సంకోచించి వెంటనే వ్యాకోచించటం వలన అధిక రక్త ప్రవాహం కలిగి నొప్పి ప్రారంభం అవుతుంది. మానసిక ఒత్తిడి,నిద్రలేమి,ఉపవాసం ఉండటం వలన ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది. 

మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎక్కువగా ఈ మైగ్రైన్ అనేది కనపడుతుంది. అయితే వ్యాధి లక్షణాలు,తీవ్రత వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటుంది. సాదారణ నొప్పి ఉండి రోజువారీ పనులకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే అసలు మందులు వాడవలసిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. 

కానీ తీవ్రమైన నొప్పితో బాధపడేవారు మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో మూడు నెలలు మందులు వాడితే సరిపోతుంది. తగినంత నిద్ర,సమతుల ఆహారం తీసుకోని జివనశైలిలో కొన్ని మార్పులను చేసుకుంటే దీన్ని పూర్తిగా నివారించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top