మెక్సికో మరియు అమెరికా దేశాలలోని వివిధ ప్రాంతాలలో పుట్టిన జామ పండులోఅనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనలో చాలా మందికి జామ పండు వలనకలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు.
కానీ జామ ఆకులో ఉన్న ఆరోగ్యప్రయోజనాల గురించి తెలియదు.జామ ఆకులో ఉండే లక్షణాలు కారణంగా అనేక సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. మనకు తెలియని,జామ ఆకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
క్యాన్సర్
జామ ఆకు రసాన్ని తగిన మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ నివారణకుసహాయపడుతుంది. జామ ఆకులో విటమిన్ సి, లైకోపీన్, పాలీ-ఫినాల్స్ వంటి సహజరసాయన సమ్మేళనాలు ఉండుట వలన క్యాన్సర్ కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంతేకాక జామ ఆకులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్ పెరుగుదలనుఅరికట్టి పెద్దప్రేగులో విష ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగేఆహారం ద్వారా వచ్చే కొవ్వు నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
డెంగ్యూ చికిత్స
జామ ఆకు రసాన్ని జ్వరం నివారణకు సహజమైన ఇంటి నివారణగా ఉపయోగిస్తారు. జామఆకులను ఉడికించి తయారుచేసిన రసంను రోజుకి మూడు సార్లు త్రాగితే డెంగ్యూజ్వరం తగ్గుతుంది. ఈ విధంగా త్రాగితే రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య కూడాత్వరగా పెరుగుతుంది.
దృష్టి(విజన్) మెరుగుదల
మన దృష్టి(విజన్) బాగుండాలంటే విటమిన్ A అవసరం. ఈ జామ ఆకుల్లో విటమిన్ Aసమృద్దిగా ఉంటుంది. అందువలన ప్రతి రోజు జామ ఆకు రసాన్ని త్రాగితే దృష్టిమెరుగు అవుతుంది. అంతేకాక కంటిశుక్లం మరియు దృష్టి లోపాలను తగ్గించటంలోసహాయపడుతుంది.
జీర్ణక్రియలో మెరుగుదల
జామ ఆకు రసం జీర్ణాశయంలో జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రోత్సహించి,జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జామ ఆకులో ఉండే యాంటి బాక్టీరియల్ఏజెంట్లు జీర్ణాశయ పొరల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాలను క్రియరహితంగామార్చేస్తాయి. జామ ఆకు రసాన్ని ప్రతి రోజు మూడు సార్లు త్రాగితేకడుపునొప్పి తగ్గుతుంది.
అతిసారం మరియు విరేచనాలు
అతిసారం మరియు విరేచనాలను తగ్గించటంలో జామ ఆకు చాలా బాగా పనిచేస్తుంది.రెండు గ్లాసుల నీటిలో గుప్పెడు బియ్యం పిండి, జామ ఆకులను వేసిమరిగించాలి. ఈ మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు తీసుకుంటే అతిసారం తగ్గుతుంది. విరేచనాలు తగ్గటానికి జామ ఆకులు మరియు జామ వేర్లు నీటిలోవేసి మరిగించి కాషాయం తయారుచేయాలి. ఈ కషాయాన్ని విరేచనాలు తగ్గే వరకుత్రాగాలి.
బరువు తగ్గటానికి
జామ టీ అనేది శరీరంలో అనవసరమైన కొవ్వును తొలగించుకోవటానికి అత్యంతప్రభావవంతముగా పనిచేస్తుంది. జామ ఆకులు పిండి పదార్దాలను చక్కెరలుగామారకుండా నివారించటం ద్వారా బరువు తగ్గేలా ప్రేరేపిస్తుంది.
డయాబెటిస్
జపాన్ లోని "యకుల్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్" వారు జామ ఆకు టీ మీదపరిశోదన జరిపారు. మధుమేహ వ్యాధి గ్రస్తులు నాలుగు నెలల పాటు జామ ఆకు టీనిత్రాగటం వలన శరీరంలో ఆల్ఫా-గ్లూకోసైడేజ్ ఎంజైమ్స్ చైతన్యం తగ్గి రక్తంలోచక్కెర స్థాయిలు తగ్గాయి. అంతేకాక శరీరం సుక్రోజ్ మరియు మాల్టోజ్గ్రహించటం కూడా తగ్గటం వలన ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ పరిశోదనపలితంగా మధుమేహం చికిత్సలో జామ ఆకు టీ సమర్ధవంతగా పనిచేస్తుందని తేలింది.
కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది
జామ ఆకు టీ ఒక సహజ కాలేయ టానిక్ గా పనిచేస్తుంది. శరీరంలో అవసరంలేనికొలెస్ట్రాల్ ని తగ్గించి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. జామఆకుల టీని 12 వారాల పాటు క్రమం తప్పకుండా త్రాగితే చెడు కొలస్ట్రాల్ LDL(తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) మరియు ట్రైగ్లిజెరైడ్స్ తగ్గిHDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.
థైరాయిడ్ పనితీరులో మెరుగుదల
థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ పనితీరును క్రమబద్దీకరణ చేస్తుంది. జామ ఆకులోరాగి ఎక్కువ మొత్తంలో ఉండుట వలన శరీరం మొత్తం హార్మోన్ల విడుదలలోనియంత్రణ కలిగి ఉంటుంది.
మలబద్దకం
జామ ఆకుల్లో పీచు పదార్థం అధిక మొత్తంలో ఉండుట వలన మలబద్దకం సమస్యవచ్చినప్పుడు మంచి విరేచనకారిగా పనిచేస్తుంది.
గాయాలు మరియు ఇన్ఫెక్షన్స్
కోతలు,ఒరిపిడి వంటి గాయాల మీద జామ ఆకు పేస్ట్ రాస్తే తొందరగా నయంఅవుతాయి. జామ ఆకులో యాంటి బ్యాక్టిరియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ ఫెక్షన్ మరియు గర్భాశయం మంట మొదలైనవి త్వరగా నయం అవుతాయి.
బ్లాక్ హెడ్స్
జామ ఆకు రసాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రోజుకి మూడు సార్లు రాస్తూఉంటే క్రమంగా బ్లాక్ హెడ్స్ మాయం అవుతాయి.
మొటిమలు మరియు నల్ల మచ్చలు
జామ ఆకుల్లో విటమిన్ C సమృద్దిగా ఉంటుంది. ఈ విటమిన్ C మొటిమలకువ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. జామ ఆకుల్లో యాంటి సెప్టిక్ లక్షణాలుఉండుట వలన మొటిమలకు కారణమైన బాక్టీరియాను నియంత్రిస్తుంది.
యాంటి ఏజింగ్ ప్రయోజనాలు
ఫ్రీ రాడికల్స్ వలన మీ చర్మం దెబ్బ తింటుందా? అయితే మీకు జామసహాయపడుతుంది. మీ చర్మాన్ని వృద్దాప్య చాయల నుండి రక్షించటం,చర్మ టోన్,నిర్మాణం ను మెరుగుపరచటానికి, ఫ్రీ రాడికల్స్ ని నిర్మూలించటానికి జామ సహాయపడుతుంది. అంతేకాక జామ పేస్ట్ చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది.
అలెర్జీలు
అలెర్జీలను జామ ఆకు తొందరగా నయం చేస్తుంది. జామ ఆకులో లో ఉండే హిస్టామిన్అనే మిశ్రమం అలెర్జీని వెంటనే నిరోదిస్తుంది.
జుట్టు నష్టం
ఎవరికైనా తల మీద ఒత్తైన జుట్టు ఉంటేనే అందం. అలాగే జుట్టును ఇష్టపడనివారు ఎవరు ఉండరు. జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే జామ ఆకుల్లో నీటిని పోసిమిక్సీ చేసి రసం తీసి తల మీద చర్మం మీద ఆ రసాన్ని పోసి మసాజ్ చేయాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే తేడాను మీరే గమనించవచ్చు.