Pain Killers:అతిగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..? ఐతే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే.

Pain Killers:నొప్పిని భరించటం అవసరమా? సమర్ధవంతమైన మందులు అందుబాటులో ఉన్నప్పుడు వాటితో నొప్పిని మటుమాయం చేసేయవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ పెయిన్ కిల్లర్స్ నొప్పిని మాత్రమే తగ్గించగలవు. 

అంతేకాని నొప్పికి కారణమైన సమస్యకు చికిత్సను అందించవు. ఈ విషయాన్ని అందరు గుర్తించాలి. సాదారణంగా నొప్పి తగ్గగానే ఆ నొప్పి గురించి మర్చిపోతూ ఉంటాం. కానీ పదే పదే ఆ నొప్పి భాదిస్తూ ఉంటే మాత్రం తప్పక డాక్టర్ ని సంప్రదించాలి.

అలా కాకుండా పెయిన్ కిల్లర్స్ ని ఇష్టానుసారం వాడేస్తే అసలు వ్యాధి ముదిరిపోవటంతో పాటు నొప్పి నివారణ మందుల వాడకం వలన కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. పెయిన్ కిల్లర్స్ ఎలా పనిచేస్తాయో తెలుసా? 

దాని గురించి తెలుసుకుందాం. శరీరంలో ఏ ప్రదేశంలోనైనా దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రదేశంలోని
నరాలు మెదడుకు పెయిన్ మెసేజ్ సిగ్నల్స్ పంపుతాయి. పెయిన్ కిల్లర్స్ దెబ్బ తగిలిన ప్రదేశం లేదా వెన్నుపాము లేదా మెదడు ఈ మూడు ప్రదేశాల్లో ఎదో ఒక ప్రదేశాన్ని మోద్దుపరచి ఈ సిగ్నల్స్ ని ఆటంకపరుస్తాయి. 

దాంతో నొప్పి అనుభవానికి రాకుండా పోతుంది. ఏది ఏమైనా పెయిన్ కిల్లర్స్ వాడే ముందు ఒకటికి
రెండు సార్లు ఆలోచిస్తే మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top