Thyroid: ఇటీవల కాలంలో నగరాల్లో ధైరాయిడ్ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. ఒక రకంగాఈ సమస్యలకు పెరిగిపోతున్న ఒత్తిడి ఒక కారణంగా చెప్పవచ్చు. ధైరాయిడ్ అనేది మన గొంతు దగ్గర ఉండే కీలకమైన గ్రంధి. ఇది స్రవించే హార్మోన్ మానసిక ఆలోచనలపై ప్రభావాన్ని చూపుతుంది.
ఈ గ్రంధి టీ3,టీ4, టీఎస్ఎచ్ హార్మోన్ లను స్రవిస్తుంది. సున్నిత మనస్తత్వం కలవారు, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకొనే వారిలో ఈ గ్రంధి స్రవించే హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది.
టీఎస్ఎచ్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవ్వటం వలన అతిగా బరువు పెరగటం, అతిగా ఆలోచన, అతి బద్ధకం,మతిమరుపు, అతి నిద్ర వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ధైరాయిడ్స మస్యలు ఎక్కువగా మహిళల్లో వస్తాయి.
మహిళల్లో రుతు స్రావ సమస్యలు, గర్భం రాకుండా ఉండేందుకు వాడే మందులు, పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు వాడే మందుల వలన కలిగే దుష్ప్రభావాలు ధైరాయిడ్ మీద పడతాయి. తల్లితండ్రులకు ధైరాయిడ్ సమస్యలు ఉంటే అవి పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ధైరాయిడ్స మస్యలు అన్ని ఒకేరకంగా ఉండవు. హార్మోన్ ల స్రావం పెరిగితే ఒకరకంగానూ,తగ్గితే ఒక రకంగానూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితమైన పరిక్షలు చేయించుకొని డాక్టర్ సలహాతో క్రమం తప్పకుండా మందులు వాడితే తప్పకుండా ధైరాయిడ్ బారి నుండి బయట పడవచ్చు.

