Cesarean Delivery:సిజేరియన్ ఏ పరిస్థితుల్లో చేస్తారు?..ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి..

Cesarean Delivery: ప్రస్తుతం ప్రకృతి సిద్దంగా ప్రసవం చేయటానికి బదులు డాక్టర్స్ డబ్బు సంపాదనలో పడి సిజేరియన్స్ చేస్తున్నారని అందరూ అనుకుంటారు. కానీ సిజేరియన్ చే యటానికి కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితుల గురించి తెలుసుకుందాం.

గర్భవతి మహిళ నడుము ఎముకలు చిన్నవి కావటం,గర్భస్థ శిశువు తల ఆకారం పెద్దగామారినప్పుడు

గర్భాశయంలో శిశువు పరిస్థితి సరిగ్గా లేకున్నా,అడ్డం తిరిగినప్పుడు

ప్రధమ ప్రసవం సందర్భంగా గర్భాశయ మార్గంలో శిశువు కాళ్ళు ముందు ఉంటే

గర్భాశయ ద్వారం వద్ద శిశువు కారణంగా గాయం ఏర్పడినప్పుడు

గర్భాశయంలో శిశువుకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు,అధిక ఒత్తిడి కారణంగా శిశువు ప్రాణానికి ముప్పు ఏర్పడినప్పుడు

మొదటి సిజేరియన్ తర్వాత రెండోవ ప్రసవంలో గర్భసంచి పై ఒత్తిడి పెరిగి గర్భసంచి చిరిగే ప్రమాదం ఉన్నప్పుడు

ప్రసవ వేదన ప్రారంభం కావటానికి ముందు ఉమ్మనీరు బయటకు వస్తే శిశువు గర్భాశయంలో ఎండిపోతాడు. ఈ స్థితిలో 12 గంటలు దాటితే వైరస్ ప్రభావానికి లోని ప్రమాదం ఏర్పడినప్పుడు సిజేరియన్ చేస్తారు.

గర్భవతి అయిన మహిళకు,శిశువు ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడిన సిజేరియన్ చేస్తారు. ఉదాహరణకు ఒకవేళ తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వచ్చే సమయంలో మల విసర్జన చేస్తే ఆమె ప్రాణానికి ముప్పు ఏర్పడవచ్చు.

ఇటువంటి సమయంలో సిజేరియన్ అవసరం అవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top