Sun Screen: మన శరీరంలోని చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందంగా,ఆరోగ్యంగా ఉండే చర్మం బాహ్య సౌందర్యాన్ని రెట్టింపు చేయటమే కాకుండా శరీరాన్ని వ్యాధుల నుంచి
కాపాడుతుంది.
మన చర్మ ఆరోగ్యానికి విటమిన్ ‘డి’ చాల అవసరం. ఇది ఉదయం సూర్య కిరణాల నుండి లభిస్తుంది. ఆ తర్వాత ఈ లోషన్ రాసుకుంటే విటమిన్ డి చర్మానికి లభిస్తుంది. ఈ లోషన్ రాసుకోవటం వలన స్కిన్ క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.
చర్మాన్ని అల్ట్రా వయిలేట్ కిరణాల నుండి రక్షించుకోవటానికి సన్ స్క్రీన్ లోషన్ వాడటం చాలా ముఖ్యం. అయితే ఈ లోషన్ ని ఎలా వాడాలో,ఎంత వాడాలో మీకు తెలుసా? అయితే దాని గురించి ఇప్పుడు తెల్సుకుందాం.
ఈ లోషన్ ని సంవత్సరంలో 365 రోజులు రాసుకోవాలి. ఈ విధంగా రాసుకుంటే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. సాదారణంగా చర్మం కోసం ఎస్ పీ ఎఫ్ – 15 లోషన్ వాడాలి.
ఇది అల్ట్రా వయిలేట్ కిరణాల నుండి చర్మాన్ని 94 శాతం కాపాడుతుంది. అదే ఎస్ పీ ఎఫ్ – 30 లోషన్ వాడితే 96 శాతం కాపాడుతుంది. లోషన్ సరైన పరిమాణంలో తీసుకోని ముఖం, మెడ, వీపు, చేతులు,కాళ్ళు,పాదాలపై రాయాలి.