Angry:మొదట సుదీర్ఘ శ్వాస తీసుకోని వదలాలి. ఈ విధంగా 5 నుంచి 6 సార్లు చేయాలి. వేగంగా
నడవటం,బ్రిస్క్ వాకింగ్ చేయటం వంటివి చేయాలి. పది నుంచి ఒకటి వరకు రెండు మూడు
సార్లు లెక్కపెట్టాలి.
అంతేకాక నాదే కరెక్ట్...ఎదుటి వారిది తప్పు అనే భావన నుండి బయటకు రావటం మంచిది. ఎక్కువ మందితో స్నేహం పెంచుకోవటం వలన మానసిక పరిణితి పెరిగి కోపం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
అనవసర వాదన వలన కోపం వస్తుందని అనిపిస్తే ఆ వాదన నుండి తప్పుకోవాలి. వారానికి ఒకసారి ఒంటరిగా కూర్చొని ఈ వారంలో కోపం ఎన్నిసార్లు వచ్చింది? ఏ ఏ సందర్భాల్లో వచ్చిందో విశ్లేషణ చేసుకోవాలి.
ఆత్మ పరిశీలన ఎప్పుడు కోపాన్ని కంట్రోల్ చేస్తుంది. సన్నిహితులతో భావాలను పంచుకుంటే కోపం తగ్గుతుంది. మీకు కోపం బాగా వచ్చినప్పుడు సరదా సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకొని నవ్వితే కోపం వెంటనే తగ్గిపోతుంది.
కోపం పరిది దాటితే వ్యక్తిగత సంబందాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని సైకాలజిస్ట్ లు అంటున్నారు. కాబట్టి కోపం తగ్గే ఇటువంటి చిన్న చిన్న సలహాలను పాటిస్తే కోపం మటుమాయం అవుతుంది.