పూరీలు అనగానే పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టం .ఈ బ్రేక్ ఫాస్ట్ ఎంత ఇష్టమో అది డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ కనుక observe చేస్తే అస్సలు తినలేము .చాలా వెగటుగా ఉంటాయి అలా అవ్వకుండా ఉండడానికి పిండి కలిపే విధానాన్ని చూద్దాం.
చేసే విధానం:
ఒక వెడల్పాటి పళ్లెం ను తీసుకొని రెండు కప్పుల గోధుమపిండికి, నాలుగు స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ పంచదార ,ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ గా కలపండి .
బొంబాయి రవ్వ వల్ల పూరీలు పొంగుతాయి. ఎక్కువసేపు నిలుస్తాయి .సాఫ్ట్ గా కలుపుకుంటే బొంబాయి రవ్వ ఉన్నది కాబట్టి పిండి కొంచెం బిగుస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి .
ఇప్పుడు దీంట్లోకి ఆలు కర్రీ చూద్దాం
మూడు బంగాళదుంపలు తీసుకొని ఒక కుక్కర్ లో వాటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోండి. అవి ఉడికేలోపు ఒక pan పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు వేసుకోండి. తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు కూడా చీలికల్లా వేసుకోండి.
రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తిరిగి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఒక స్పూన్ అల్లం తురుము వేసుకోండి. మీడియం సైజు క్యారెట్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా కలుపుకోండి. కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి ,ఉల్లిపాయలు transparant గా వేగే వరకు వేగించుకోవాలి.
ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల శనగపిండి వేసుకొని, ఒక అరకప్పు నీళ్లు ఉండలు లేకుండా నీట్ గా కలుపుకోవాలి. ఇది కూడా పక్కన పెట్టుకోండి. ఉడికిన బంగాళదుంపల్ని కూడా తొక్కు తీసేసి స్మాష్ అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు కనిపించేలాగా చేసుకొని వాటిని కూడా ఉల్లిపాయల పాన్లో వేసుకొని మూత పెట్టండి.
కొంచెం మగ్గిన తర్వాత ఒక కప్పు వాటర్ పొయ్యండి. ఇప్పుడు కర్రీ flexible గా ఉందా లేదా టైట్ గా ఉందో చూసుకొని ఇంకొక కప్పు వాటర్ వేసుకోండి. కొంచెం ఒక పొంగు వస్తున్నప్పుడు శనగపిండి కలిపి పక్కన పెట్టారు కదా అది మరొక సారి స్పూన్ తో కల పెట్టి అందులో పోయండి.
ఒక ఐదు నిమిషాలు పాటు లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించుకోండి. కొంచెం తురిమిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. గార్నిష్ గా బాగుంటుంది కొద్దిగా flexible గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి .మనం పూరీలు రెడీ అయ్యేసరికి అది కరెక్ట్ గా కన్సస్టెన్సీ లోకి వచ్చేస్తుంది .
ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెని పెట్టుకోండి. అంతలో పూరి పిండిని తీసి ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పొడి పిండి చల్లుకుంటూ చిన్న సైజుల్లో పూరీలు చేసుకోండి .
కొద్దిగా మందంగా చేసుకుంటే బాగా పొంగుతాయి. ఇలా చేసి పెట్టుకొని ఒకటి ఒకటిగా మీడియం ఫ్లేమ్ లో వేగించుకోండి. తీసినవి ఒక టిష్యూ పేపర్ మీద పెట్టుకుంటే oil observe చేస్తాయి. అప్పుడు ప్లేట్లోకి రెడీ చేసుకోండి.


