Janthikalu:జంతికలు చేసేటప్పుడు ఈ 3 పప్పులు కలిపి ఈ టిప్స్ తో చేయండి రుచిగా గుల్లగా వస్తాయి

ఎక్కువగా జంతికలు బియ్యప్పిండి, శనగపిండి కలిపి వేస్తూ ఉంటాం కదా. ఇలా పప్పులు కూడా కలిపి వేసుకోవడం వల్ల టేస్ట్, క్రిస్పీ, కలర్ అన్ని ఉంటాయి. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.

కావలసినవి:
కడిగి ఆరబోసుకున్న బియ్యప్పిండి, మినప గుళ్ళు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, ఉప్పు, కారం నువ్వులు వాము వెన్న.

చేసే విధానం:
నాలుగు కప్పుల బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని, ఎండలో బాగా పొడిగా అయ్యేదాకా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పొడిగా 1/3 అంటే పావు కప్పు కి కొంచెం ఎక్కువ తీసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టి రెడ్ కలర్ వచ్చేవరకు బాగా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి.

మళ్ళీ same అదే కొలతతో మినప గుళ్ళు తీసుకోండి. same అలాగే వేగించుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చూసుకోండి. Same మళ్ళీ అదే కొలత తో పెసరపప్పు తీసుకొని అవి కూడా అలాగే వేగించుకోవాలి. ఈ మూడు పప్పులు కలిపి ఒక కప్పు అవుతాయి.

పెసరపప్పు, మినప గుళ్ళు, పచ్చిశనగపప్పు ఈ మూడు చల్లారిన తర్వాత బియ్యంతో కలిపి పిండి మిల్లులో బాగా మెత్తగా ఆడించుకోండి. ఒక టేబుల్ స్పూన్ వాము, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, పచ్చి నువ్వులు, రెండు స్పూన్లు కారం, రెండు స్పూన్లు ఉప్పు ,పావు కప్పు వెన్న లేక వేడి నూనె వేసి మొత్తం ఈ పిండిలన్నీ వెన్న తేమ తోటి పొడి పిండి అంతా బాగా కలుపుకోవాలి.

టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. ఏమన్న తగ్గితే మీరు ఇప్పుడు కలుపుకోవచ్చు తర్వాత గోరువెచ్చని నీళ్లు తీసుకొని పిండిని మొత్తం ఒకేసారి కలపకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుని కలుపుకుంటూ ముద్ద అయ్యేది చూసుకోవాలి. పిండి సాఫ్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఒత్తినప్పుడు అది smooth గా దిగేలా ఉండాలి. కాబట్టి ఆ బెటర్ ని చూసుకోండి.

ఇప్పుడు మురుకలు గొట్టం తీసుకొని, జంతికల లావు బెజ్జాల పల్లెం పెట్టుకొని ఆ లోపల గొట్టానికి లోపల నూనె రాసి ఇప్పుడు దానికి సరిపడా ముద్దని అందులో పెట్టుకొని బాగా కాగిన తర్వాత వేసి మీడియంలో వేగించుకొని నెమ్మదిగా మరొకవైపు కూడా తిప్పుకొని తీసి పక్కన పెట్టుకోండి. అంతే నోరూరించే పప్పుల వెరైటీ జంతికలు రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top