మురుకులు చాలా రకాలుగా చేసుకుంటాం. అన్ని మిక్స్ పప్పులు కలిపి, బియ్యప్పిండి శనగపిండి కలిపి ,అలాగే పెసర పప్పు ఉడకపెట్టిన మురుకులు టేస్ట్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా.. ఎందుకు ఆలస్యం.. ఇవి క్రంజీగా, క్రిస్పీగా, నల్ల నువ్వులు వేయటం వల్ల టెక్చర్ అన్ని బాగుంటాయి.
కావలసినవి:
అర కప్పు పెసరపప్పు ,రెండు కప్పుల బియ్యం పిండి, నల్ల నువ్వులు లేక తెల్ల నువ్వులు, జీలకర్ర ఏవైనా ఉపయోగించవచ్చు. ఉప్పు, కారం ,ఇంగువ, వెన్న కావలసినంత నూనె.
చేయు విధానం:
అర కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్ లోకి తీసుకొని అరకప్పు పెసరపప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసుకుని నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్లు ఏమీ పోయకుండా ఉన్న వాటర్ తోటి మిక్సీ పట్టండి. ఆ బెటర్ సరిపోతుంది.
ఇప్పుడు వేరే ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్యప్పిండి, ఒక స్పూను నల్ల జీలకర్ర ,ఒక స్పూను ఎండుకారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ అన్ని పొడిగా కలుపుకుంటూ రెండు టీ స్పూన్ల వెన్న కూడా వేసి బాగా పిండిని చేతితో కలుపుకోండి. ఇందులో మనం ఇంకా వాటర్ కాకుండా ఈ పెసరపప్పు పేస్టు చేసాం కదా అది తీసుకొని కలుపుకోండి.
కొంచెం గట్టిగానే చపాతీ పిండి లాగానే బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. పిండి Consistency బట్టి ఒక్క స్పూన్ వాటర్ అంతకంటే అవసరం ఉండదు. మన చేతికి గట్టిగా smooth గా ఉందో లేదో చూసుకోండి.
డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేడి చేసుకోండి. బాగా కాగేలోపు మురుకులు గొట్టం తీసుకొని స్టార్ ప్లేట్ పెట్టుకొని దానికి సరిపడా ముద్దని పెట్టి ఒత్తుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో వేగనిస్తే క్రిస్పీగా ,క్రంచిగా ఉండే జంతికలు రెడీ.

