Manchurian dosa ను ఒకసారి తింటే అసలు వదిలిపెట్టకుండా తింటారు. చాలా రుచిగా ఉంటుంది. ఈ దోసె చాలా వైరైటిగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు
ఛాయ మినప్పప్పు - 150 గ్రాములు
మెంతులు - 10 గ్రాములు
క్యారెట్లు - 1/4కేజీ
గ్రీన్ బఠాణీ - 100 గ్రా
వెల్లుల్లి - 20 గ్రాములు
సోయాసాస్ - 2 టీస్పూ
అజినమోటో - 1/4 టీస్పూ
ఉప్పు - సరిపడా
ఉప్పుడు బియ్యం - 1/2కేజీ
శనగపప్పు - 50 గ్రా
బీన్స్ - 150 గ్రా
పచ్చిమిర్చి - 20 గ్రా
అల్లం - 10 గ్రా
చిల్లీసాస్ - 1 టీస్పూ
రిఫైన్డ్ ఆయిల్ - 50 గ్రా
కొత్తిమీర - 1 కట్ట
కార్న్‌ఫ్లోర్ - తగినంత
తయారీ విధానం
ముందుగా ఛాయ మినప్పప్పు,ఉప్పుడు బియ్యం,శనగపప్పు,మెంతులను నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బి ఉప్పు వేసి ఐదు గంటల పాటు పులియబెడితే దోశ పిండి తయారు అవుతుంది.
ఇప్పుడు క్యారెట్, బీన్స్‌లను సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. గ్రీన్ బఠాణీ, క్యారట్,బీన్స్ ఈ మూడింటిని ఉడికించి ఉంచుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక అల్లం,వెల్లుల్లి ముక్కలను వేయాలి. అవి వేగాక ఉడికించి ఉంచుకొన్న గ్రీన్ బఠాణీ, క్యారట్,బీన్స్,పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.
ఆ తర్వాత సోయాసాస్, అజినమోటో, చిల్లీసాస్,ఉప్పు వేసి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. అందులో కార్న్‌ఫ్లోర్ కలిపిన నీరు పోసి చిక్కబడ్డాక సన్నగా తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర కలపాలి.
ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి నూనె వేసి పైన తయారుచేసుకున్న దోశ పిండితో దోశ వేయాలి. దోశ కొంచెం వేగాక దాని మీద పైన తయారుచేసుకున్న మిశ్రమాన్ని పరచి రోల్ చేయాలి. అంతే మంచూరియా దోశె రెడీ. దీనిని టమాటో సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది.


