
Telaga pindi Kura:నూపప్పు నుండి నూనె తీసిన తరువాత వచ్చే వ్యర్థాన్ని తెలగ పిండి అంటారు. ఈ పిండిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వారంలో ఒకసారైన ఈ కూర తింటే మంచిది.
కావలసిన పదార్దాలు
పచ్చి శనగపప్పు : పావుకేజీ
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 4
కారం : ఒక స్పూన్
ఉప్పు : సరిపడా
కరివేపాకు : 2 రెమ్మలు
జీలకర్ర : అర టీ స్పూన్
ఆవాలు : అర టీ స్పూన్
వెల్లుల్లి : 4 రెబ్బలు
నూనె : 2 టేబుల్ స్పూన్లు
పసుపు : అర టీ స్పూన్
తెలగపిండి : 100 గ్రాములు
తయారుచేసే విధానం
పచ్చి శనగపప్పును కడిగి పావుగంట నానబెట్టాలి. ఉల్లిపాయలను,పచ్చిమిరపకాయలను ముక్కలుగా కోయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగాక, ,ఉల్లిముక్కలు,పచ్చిమిర్చి ముక్కలను వేసి వేగించాలి.
తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగాక, పసుపు, కారం వేసి కలిపి శనగపప్పును వేసి బాగా కలిపి, సరిపడా నీళ్ళుపోసి మూతపెట్టి కొంతసేపు ఉడకనివ్వాలి.ఇలా పది నిముషాలు ఉడికిన తర్వాత శుభ్రం చేసిన తెలగపిండిని వేసి పది నిమషాలు ఉడకనివ్వాలి. తర్వాత కూర పొడి పొడిగా అయ్యాక స్టవ్ మీద నుండి దింపాలి. నోరురుంచే తెలగపిండి కూర తినటానికి రెడీ. కావలసిన వారు కొంచెం నిమ్మరసం కూడా పిండు కోవచ్చు.

