Acid Reflux:ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువగా మసాలాలు ఉన్న ఆహారం తీసుకోవడం వంటి అనేక రకాల కారణాలతో మనలో చాలా మంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు.
గ్యాస్ సమస్య వచ్చిందంటే... తగ్గాలంటే చాలా కష్టం అవుతుంది. గ్యాస్ సమస్యను అసలు అశ్రద్ధ చేయకూడదు. ఒకవేళ అశ్రద్ధ చేస్తే పేగుల్లో అల్సర్ వచ్చే అవకాశం ఉంది. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు మనలో చాలామంది మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు.
అలా కాకుండా మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా సులభంగా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఒక గ్లాసు నీటిలో 20 ml పాలు, ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసి బాగా కలిపి తాగాలి. ఈ విధంగా తాగటం వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది.
ఈ విధంగా తాగటం వలన గ్యాస్, కడుపుబ్బరం, కడుపులో మంట, కడుపునొప్పి వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అలాగే గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో అర స్పూను జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, పావు స్పూన్ నల్ల ఉప్పు వేసి బాగా కలిపి తాగాలి.
ఈ విధంగా తీసుకుంటే గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ రెండు చిట్కాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయకుండా ఇలా చిట్కాలను ఫాలో అవ్వండి. ఇలా చిట్కాలను ఫాలో అయినా సరే తగ్గకపోతే కచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.