Rayalaseema Mamidikaya Pachadi: అన్నంలోకి ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ రోటి కారం రాయలసీమ స్పెషల్

రాయలసీమ స్పెషల్ మామిడికాయ రోటి పచ్చడి. ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. టిఫిన్స్ లోకి రైస్ లోకి కూడా పుల్లపుల్లగా బావుంటుంది. చెక్కుతో మిక్సీ పట్టడం వల్ల పులుపు సమానంగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది.

కావలసినవి
200 గ్రాముల మామిడికాయలు అంటే సుమారు ఒక కప్పు సమానంగా కట్ చేసుకున్న ముక్కలు. కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇంకా పోపుకి సంబంధించిన దినుసులు.

చేయు విధానం:
200 గ్రాముల పచ్చి మామిడికాయ ముక్కలు చెక్కు తీయకుండా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నిండుగా కారం ,అర టేబుల్ స్పూన్ ఉప్పు, తర్వాత ఏమైనా తక్కువ ఎక్కువ సరిచేసుకోవచ్చు. మిక్సీ చేయాలి.

ఆ తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకోసారి బ్లెండ్ చేసి కచ్చాపచ్చాగా చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపుకి తయారు చేసుకుందాము. మూడు టేబుల్ స్పూన్ ఆయిల్, అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర, ఒక స్పూన్ మినప గుళ్ళు ,ఒక స్పూన్ పచ్చిశనగ పప్పు ,పోపు కొంచెం వేగిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి.

ఒక ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసి ఆ నూనెలో మిక్సీ పట్టిన మామిడికాయ ముద్దని వేసి కలుపుకోండి. ఆయిలీ ఆయిలీగా టేస్టీగా ఉంటుంది .ఇందులో మనం ఆవపిండి ,మెంతిపిండి వేయలేదు. మామిడికాయ ముక్కలు చెక్కు తీయలేదు ఇలా చేసింది టేస్ట్ ఎలా ఉందో కూడా గమనించండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top