Masala Buttermilk:సమ్మర్ అంటేనే ప్రతి ఒక్కళ్ళు బట్టర్ మిల్క్ ఇష్టపడతారు కదా. ఎండలో ఎంత తిరిగి వచ్చినా చల్ల చల్లని బట్టర్ మిల్క్ మనకి ఆహ్లాదాన్ని ఇస్తుంది.
ఎంత మజ్జిగ తాగితే అంత మంచిదని ఎక్కువగా పల్చగా వాటర్ కలుపుకొని తాగుతారు. రాగిజావల్లో తాగుతారు కదా.. సో మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగితే ఇంకా అద్భుతం.
కావలసినవి:
ఒక కప్పు పెరుగు ,మూడు కప్పుల water, బట్టర్ మిల్క్ పొడి - ధనియాలు ,జీలకర్ర , ఎండబెట్టిన పుదీనా, ఇంగువ ,ఆమ్చూర్ పౌడర్.
చేయు విధానం:
30 గ్రా ధనియాలు, 50 గ్రా జీలకర్, 3 ఇంచుల సొంటి ఎండిన అల్లం, మిక్సీలో బ్లెండ్ అవ్వదు కాబట్టి కొంచెం దంచి పక్కన పెట్టుకోండి, ఇప్పుడు ఈ ధనియాలు ,జీలకర్ర కూడా low flame పెట్టుకొని ఒక బాండీలో కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకోండి.
ఈ రెండు కూడా శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తాయి. కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు కూడా వేసి వేగనివ్వాలి. అలాగే కొంచెం పుదీనా అది కూడా బాగా కడిగి ఎండబెట్టేసిన తర్వాత అది డ్రై అవుతుంది. కొంచెం డ్రై మ్యాంగో పౌడర్ ఇంట్లో చేసుకుని ఒక బాటిల్లో preserve చేసుకోండి లేదంటే బయట కూడా available గా ఉంటుంది.
ఇది టేస్టీ అండ్ హెల్దీ కూడా .ఇప్పుడు మిక్సీ జార్ లో దంచి పెట్టుకున్న సొంటి పొడి, ధనియాలు, మిరియాలు ,జీలకర్ర వేగించినవి ,ఒక గుప్పెడు పుదీనా ఆకులు ,రెండు స్పూన్ల ఆమ్చూర్ పౌడర్ ,ఒక టీ స్పూన్ కల్లుప్పు, పావు స్పూన్ ఇంగువ వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి .దాన్ని జల్లించుకుంటే ఇంకా fine powder వస్తుంది fine గా ఉంటే మనకు మజ్జిగలో కలిపినప్పుడు బాగా కలుస్తుంది.
మళ్లీ అవసరమైతే మళ్లీ మిక్సీ పట్టి మళ్ళీ జల్లెడ వేసుకోండి. ఈ పౌడర్ చల్లారిన తర్వాత కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. మనకి ఇయర్ అంతా కూడా స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఒక కప్పు పెరుగుకి మూడు కప్పుల వాటర్ కలిపి ఒక స్పూను పౌడర్ కలిపి బాగా మిక్స్ చేసుకుంటే సాల్ట్ సరిపడా చూసుకొని కూల్ కూల్ గా బట్టర్ మిల్క్ రెడీ.