Hair Growth Tips in telugu:ఈ మధ్యకాలంలో మారిన జీవన శైలి పరిస్థితి, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు ప్రారంభం కాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
అయితే ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చుండ్రు, జుట్టు రాలే సమస్య వంటి వాటిని చాలా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.
ఒక బౌల్ లో 8 స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాలి. దానిలో రెండు స్పూన్ల కలోంజీ విత్తనాలను వేసి బాగా కలపాలి. ఈ నూనెను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయాలి. ఈ నూనె చల్లారాక వడగట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. kalonji గింజలలో ఎన్నో పోషకాలు, ఆమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలలో ఎంతగానో ఉపయోగపడతాయి.
జుట్టును ఒత్తుగా, పొడవుగా, నల్లగా పెరగడంలో kalonji విత్తనాలు మనకు ఎంతో సహాయపడతాయి. అలాగే కొబ్బరి నూనెలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలలో ఎంతో సహాయపడతాయి. కొబ్బరి నూనెను వాడడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.