మనం సాదారణంగా ఉల్లిపాయ పకోడీ చేసుకుంటాం. అలా కాకుండా పిల్లలకు నూడుల్స్ తో పకోడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే వెరైటిగా కూడా ఉంటుంది.
కావలసిన పదార్దాలు
ఉల్లిపాయలు – 4
ఉడికించిన నూడుల్స్ – 1 కప్పు
కరివేపాకు -3 రెబ్బలు
కొత్తిమిర – 2 రెబ్బలు
పసుపు -1/4 tsp
కారం పొడి – 1 tbsp
గరం మసాలా పొడి -1 tsp
ధనియాల పొడి – 1 tbsp
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి
తయారి విధానం
ఉల్లిపాయలను సన్నగా కోసి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు,ఉడికించి పెట్టుకున్న నూడుల్స్, కారం, పసుపు, గరం మసాలా పొడి, ధనియాలపొడి, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
బాణలిలో నూనె పోసి వేడి చేసి ఈ మిశ్లమాన్ని ముద్దగా కాకుండా పొడి పొడిగా వేగించాలి. ఈ పకోడీలను నెమ్మదిగా రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించాలి. ఈ పకోడిలను ఆవకాయ లేదా టమాట సాస్ తో సర్వ్ చేస్తే బాగుంటుంది.