బార్లీ గింజలను ఒకప్పుడు చాలా ఎక్కువగా వాడేవారు. ఆ తర్వాత బార్లీ వాడకం కాస్త తగ్గింది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా బార్లీ వాడకం చాలా ఎక్కువగా పెరిగింది. బార్లీని ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
బార్లీ గింజలతో సూపులు, బ్రెడ్స్ వంటివి తయారు చేస్తూ ఉంటారు. ఒక బౌల్ లో రెండు స్పూన్ల బార్లీ గింజలు వేసి నీటితో శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి కాస్త వేడి అయ్యాక నానబెట్టుకున్న బార్లీ గింజలు వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి చల్లారిన తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు వేసి ప్రతిరోజు తాగాలి. ఈ విధంగా తాగటం వలన అధిక బరువు సమస్య, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేసే మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ వేసవిలో శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కాబట్టి బార్లీ గింజలను వాడి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.