Brisk Walking Benefits:ఈ రోజుల్లో చాలా మంది బ్రిస్క్ వాకింగ్ మీద దృష్టి పెడుతున్నారు. ఈ వాకింగ్ లో మాములుగా నడిచే దాని కన్నా కూడా వేగంగా నడవాలి. ఒక మైలు దూరాన్ని పన్నెండు నుంచి పదిహేను నిమిషాల లోపు నడవాలి. అంటే సుమారుగా గంటకు నాలుగైదు మైళ్ళు నడవాలి. అప్పుడే అది బ్రిస్క్ వాకింగ్ అవుతుంది. చాలా వేగంగా పరుగెత్తుతూ ఉన్నట్టు నడవాలి.
అయితే బ్రిస్క్ వాకింగ్ ను ఒకేసారి చేయనక్కరలేదని నిపుణులు చెప్పుతున్నారు. రోజు మొత్తంలో రెండు సార్లు నాలుగు మైళ్ళ చొప్పున నడిస్తే సరిపోతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు,రాత్రి డిన్నర్ కి తర్వాత ఈ బ్రిస్క్ వాక్ చేయాలనీ నిపుణులు సూచిస్తున్నారు.
లాభాలు
ఒత్తిడిని నివారించి,మెదడును ప్రశాంతంగా ఉంచే శక్తి బ్రిస్క్ వాకింగ్ కి ఉంది.
ఆస్టియోఫ్లోరోసిస్,కోలన్ క్యాన్సర్,మలబద్దకం వంటి సమస్యల నుండి కాపాడుతుంది.
డిప్రేషన్ కి మందులు వాడటం కన్నా బ్రిస్క్ వాకింగ్ చేయటం చాలా మంచిదని నిపుణులు చెప్పుతున్నారు. డిప్రేషన్ తో బాధపడేవారు బ్రిస్క్ వాకింగ్ చేసినట్లైతే మందులతో పని లేకుండా దీని నుండి బయట పడవచ్చు.
మారిన జీవన విధానంలో బ్యాక్ పెయిన్ అనేది సర్వ సాదారణం అయిపొయింది. దీనిని తగ్గించటానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది.
గాడ నిద్ర పట్టటానికి కూడా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

