సాదారణ ప్రసవం అయినప్పుడు పెద్దగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం లేదు. అయితే సిజేరియన్ అయిన స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాదారణ ప్రసవం జరిగినప్పుడు ఎనిమిది గంటల తర్వాత లేచి నెమ్మదిగా అటు ఇటు నడవవచ్చు. సిజేరియన్ అయిన స్త్రీలు మాత్రం అలా చేయకూడదు. ఇప్పుడు సిజేరియన్ అయిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాము.
* సిజేరియన్ అయిన తర్వాత అటు ఇటు కదలటం,లేవటానికి ప్రయత్నించటం వంటివి అసలు చేయకూడదు. సిజేరియన్ అయిన తర్వాత 24 గంటల పాటు పుర్తిగా పడుకొని ఉంటే మంచిది. లేవటానికి ప్రయత్నిస్తే ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో కుట్లు కదిలే ప్రమాదం ఉంది.
* సిజేరియన్ అయిన 24 గంటల తర్వాత డాక్టర్ సలహా మీద గదిలో అటు ఇటు నడవాలి. ఇలా నడవటం వలన శరీర భాగాలలో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. రక్తం గద్దకట్టటం అనేది కొన్ని సమయాల్లో తల్లి పాల మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది.
* సిజేరియన్ తర్వాత నడవటం మొదలు పెట్టాక మెట్లు ఎక్కటం,దిగటం వంటివి చేయకూడదు. పాపాయిని ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు కూడా మీకు సౌకర్యంగా ఉన్న వాహనాన్ని ఎంచుకోండి.
* కింద ఉన్న వస్తువులను తీసుకొనేటప్పుడు వంగి తీసుకోవటం కంటే పొట్ట మీద భారం వేయకుండా సాధ్యమైనంత వరకు చేతితో తీసుకోవటం మంచిది.
* మంచం మీద కుర్చుని గోడకు అనుకొనే సమయంలో వీపు వెనుక భాగంలో దిండు లేదా మెత్తని దుప్పటి పెట్టుకోవటం మంచిది.
* మంచం మిద కూర్చున్న సమయంలో మోకాళ్లను గుండెల దాక నెమ్మదిగా అప్పుడప్పుడు తీసుకురావటం ద్వారా మంచి పలితాన్ని పొందవచ్చు.
* మంచం మీద నుంచి వెంటనే కిందికి దిగే ప్రయత్నం చేయకూడదు. ఒక చేయి మీద పక్కకు వంగి,ముందు ఒక కాలు కిందికి వేసి,అనంతరం రెండో కాలును కిందికి ఆన్చాలి. రెండు కాళ్ళు ఒకేసారి కిందికి వేసి ఎప్పుడు మంచం దిగకూడదు.
* సిజేరియన్ అయిన తర్వాత కొందరిలో పొడిదగ్గు చాలా తీవ్రంగా ఉంటుంది. వీరు నెమ్మదిగా దగ్గాలే తప్ప గట్టిగా పొట్ట నరాలు కదిలే విధంగా దగ్గకూడదు.
* అదే విధంగా గట్టిగా నవ్వకూడదు. పొట్ట నరాలు కదిలే విధంగా నవ్వటం వలన కుట్లు కదిలే అవకాశం ఉంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


