గర్భం దాల్చిన సమయం నుండి తొమ్మిది నెలల పాటు స్త్రీ జాగ్రత్తగా ఉంటేనే పండంటి పాపాయికి జన్మనివచ్చు. కొన్ని పదార్దాలను ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే కొన్ని పదార్దాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు చెప్పుతున్నారు.
* కాఫీ,టీలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కాఫీని పూర్తిగా మనివేస్తేనే మంచిది. కాఫీలోని కెఫిన్ తల్లి ఆరోగ్యంతో పాటు గర్భస్థ శిశువు యొక్క ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది.
* మైదాతో చేసిన పదార్దాలకు దూరంగా ఉండాలి. గోధుమతో చేసిన బ్రెడ్,రొట్టెలను మాత్రమే తీసుకోవాలి.
* చేపలు ఆరోగ్యానికి మంచివే అయిన కొన్ని రకాల చేపలకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో డైటీషియన్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
* పాలను బాగా కాచి మాత్రమే త్రాగాలి. కొందరికి పచ్చి పాలు త్రాగే అలవాటు ఉంటుంది. గర్భంతో ఉన్న సమయంలో ఈ అలవాటును మానుకోవాలి. పచ్చిపాలలో ఉండే బ్యాక్టిరియా తల్లి శరీరం ద్వారా గర్భస్థ శిశువుకు చేరే ప్రమాదం ఉంది.
* గుడ్డు ఆరోగ్యానికి మంచిదే అయిన,అధిక ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా ఉడికించిన గుడ్డును మాత్రమే తీసుకోవాలి. పగిలిన గుడ్డును ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అలాగే ఉడికించిన గుడ్డును వెంటనే తినాలి. కానీ ఫ్రిజ్ లో పెట్టి తినకూడదు.
* కూరగాయలను తరగక ముందే శుభ్రం చేయాలి. ఉప్పు నీటిలో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే కూరగాయలను తరగాలి. వీటి మీద చల్లే పురుగు మందులు మాములు నీటికి పోవు. ఉప్పు నీటితో కడిగినప్పుడు మాత్రమే ఈ మందులు పోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


