Beauty Tips: అందమైన గులాబీ రంగు చెక్కిళ్లు కావాలంటే ఈ ఇంటి చిట్కాలు మీ కోసమే.. ఒక బీట్ రూట్ తీసుకోని బాగా ఉడకబెట్టాలి. దీనిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేయాలి.దీనిలో రెండు స్పూన్స్ పాలు, ఒక స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి,మెడకు పట్టించి, అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
రెండు స్పూన్స్ శనగపిండిలో ఒక స్పూన్ పాలమీగడ, మూడు స్పూన్స్ గోధుమ పొట్టు, కాస్త పెరుగు వేసి కలపాలి. దీనిని ముఖానికి పట్టించి పావుగంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి.
కీరదోస ముక్కలను గుజ్జులా చేసుకొని,దానికి పావుకప్పు నిమ్మరసం, ఐదు స్పూన్స్ తేనే, పాలు చేర్చి బాగా కలపాలి. ఈ గుజ్జు మరీ జారుగా ఉంటే కొంచెం వరిపిండిని కలపవచ్చు. ఈ మొత్తం మిశ్రమాన్ని ఐదు గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఆ తర్వాత దానిని ముఖానికి ప్యాక్ వేసుకొని 20 నిమిషాలు తర్వాత శుభ్రం చేసుకోవాలి.
కేవలం ముఖానికి ప్యాక్స్ వేసుకోవటమే కాకుండా, నలుగు పెట్టుకోవటం వలన కూడా చర్మం యవ్వనంగా కనిపించి, చెంపలు నిగారింపు సంతరించుకుంటాయి.
పావుకప్పు నిమ్మరసంలో పాలు కలిపి చెంపలకు రాసుకోవాలి. ఈ విధంగా తరచూ చేస్తూ ఉంటే చెంప భాగంలో రక్తప్రసరణ పెరిగి గులాబీ రంగులో మెరుస్తాయి.