Skin Care Tips:చర్మ తత్వాన్ని బట్టి వాడవలసిన ఉత్పత్తులు మార్కెట్ లో అధికంగానే లభిస్తున్నాయి. అయితే వాటిని కొనాలంటే చాలా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో చర్మ సమస్యల నుండి బయట పడవచ్చు.
జిడ్డుచర్మం
చర్మంపై ఉత్పత్తి అయ్యే జిడ్డును తొలగించటానికి శనగపిండి, పసుపు, నిమ్మరసం కలిపిన మిశ్రమం బాగా పనిచేస్తుంది. అలాగే ముఖాన్ని తేనే,నిమ్మరసం కలిపిన నీటితో శుభ్రం చేసుకున్న మంచి పలితం కనపడుతుంది. ఓట్స్,నీరు కలిపి నలుగు పిండిగా వాడితే జిడ్డు తగ్గుతుంది.
పొడి,సాదారణ చర్మం
ఓట్స్,బాదం,పాల మీగడ కలిపి ముఖానికి రాసుకొని 20 నిముషాలు అయిన తర్వాత తక్కువ ఘాడత కలిగిన ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ చర్మ తత్త్వం ఉన్న వారు శనగపిండి, పాలు కలిపి క్లెన్సర్ గా వాడుకోవచ్చు.
కాంతిరహిత చర్మం
చర్మం నిర్జీవంగా కనిపిస్తే బొప్పాయి గుజ్జు,కమలా రసం కలిపి రాసుకుంటే మంచి పలితం కనపడుతుంది. బొప్పాయిలోని పైపెన్ ఎంజైమ్, కమలా రసంలోని సి విటమిన్ మృత కణాలను తొలగిస్తుంది.