Pigmentation Marks: ఈ ప్యాక్ వేసుకోండి.. ముఖంపై తెల్లమచ్చలు ఇట్టే మాయం.. ముక్కు, నుదురు, చెంపలపై వచ్చే తెల్లమచ్చలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. వాటిని రసాయనాలతో కాకుండా ఇంటిలో సహజంగా దొరికే పదార్దాలను ఉపయోగించి తగ్గించుకోవటం మంచిది.
ఒక స్పూన్ నిమ్మరసంలో అర స్పూన్ దాల్చినచెక్క పొడిని కలిపి పేస్ట్ చేసి తెల్ల మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయాలి. ఒక రోజులో ఈ విధంగా రెండు సార్లు చేయాలి. అలాగే దాల్చినచెక్క పొడిలో తేనే కలిపి రాసుకున్నా మంచి పలితం కనపడుతుంది.
ఒక స్పూన్ ఓట్స్, అర స్పూన్ తేనే, టమోటో గుజ్జు కలిపి, ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకొనే ముందు మచ్చలు ఉన్న ప్రాంతంలో రాసుకొని, మర్నాడు ఉదయం శుభ్రం చేసుకోవాలి.
రెండు స్పూన్స్ ఓట్స్ కి సరిపడా పెరుగు, కొద్దిగా నిమ్మరసం,ఆలివ్ నూనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ పెరుగు,అరస్పూన్ తేనే,కొంచెం ఉప్పు వేసి అన్నింటిని బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముక్కుకు రెండు వైపులా,చెంపలు,నుదురు పైనా రాసుకుంటే మంచి పలితం కనపడుతుంది.