Parenting Tips:పిల్లలకు పోషకాహారం ఏ విధంగా పెట్టాలి.. సాదారణంగా చాలా మంది పిల్లలు రోడ్డు పక్కన ఉండే ఆహార పదార్ధాలు, బేకరి ఐటమ్స్ చుస్తే తినకుండా ఉండలేరు. అటువంటి చిన్నారులకు ఇంటిలో పోషకాహారం అలవాటు చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సాదారణంగా పిల్లలు తల్లితండ్రుల దగ్గర నుండి నేర్చుకుంటారు. పోషకాహారం తీసుకొనే విషయంలో పెద్దవాళ్ళు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి.
ప్రతి రెండు గంటలకు ఒకసారి పిల్లలకు ఏదో ఒకటి కొద్దిగానైనా తినిపించాలి. ఇది అలవాటు చేయాలంటే ఇంటిలో పండ్లు, పోషకాహారం కలిగిన చిరుతిళ్ళు అందుబాటులో ఉంచండి. పండ్ల ముక్కలను అందంగా కోసి ఇవ్వటం, పోషకాహారంను నోరు ఉరించేలా చేయటం వంటివి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.
పిల్లలకు తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఇవ్వాలి. అంటే పొట్టు తీయని గోడుమలతో చేసిన బ్రెడ్, ఓట్స్ వంటివి. అయితే వాటిని అలాగే ఇచ్చేయకుండా శాండ్ విచ్ లా చేయటం, ఓట్స్ లో పండ్ల ముక్కలు, నట్స్ వేసి ఇవ్వటం చేయాలి.
జంక్ ఫుడ్ ను ఒక్కసారిగా మానిపిస్తే, వారికీ ఇంకా తినాలనే కోరిక పెరుగుతుంది. మొదట్లో వారానికి ఒకసారి తినిపించండి. తర్వాత 15 రోజులు..... ఆ తర్వాత నెల రోజులు.... ఇలా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి.