Body Odour Control : చెమట దుర్వాసన వస్తుందా? ఇదిగో ఇలా చేసేయండి.. చెమట పడితే శరీరం వాసన రావటం సహజమే. కానీ కొంత మందికి అతిగా దుర్వాసన వస్తుంది. ఎన్ని డుయోడరంట్స్, సెంట్ లు వాడిన ఎటువంటి ప్రయోజనం ఉండదు.అటువంటి వారు వారి అలవాట్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారంలో ఉల్లి,వెల్లుల్లి,మెంతి కూర వంటి వాటిని వాడటం బాగా తగ్గించాలి. అంతేకాకుండా ఇంటిలో ఉన్నప్పుడు చెమట పట్టినా పట్టకపోయినా ప్రతి రోజు రెండు సార్లు స్నానం చేయటం తప్పనిసరిగా చేయాలి.
శరీరానికి సెంట్ వాడటం కన్నా టాల్కం పౌడర్ వాడటం మంచిది. అలాగే ప్రతి రోజు చక్కగా శుభ్రం చేసిన బట్టలను వేసుకోవాలి. ఒంటి దుర్వాసనతో బాధపడేవారు తప్పనిసరిగా సాయంత్రం స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి.
ఎక్కువ వాసన వచ్చే డుయోడరంట్స్ వాడకూడదు. తక్కువ ఘాడత ఉన్నా డుయోడరంట్స్ మాత్రమే వాడాలి.