Anjeer Benefits: మీరు అంజీర్ పండ్లు తింటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. తీపి,వగరు రుచితో ఉండే అంజిరా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా మలబద్దకం, లైంగిక సమస్యలు,అజీర్తి,మధుమేహం, దగ్గు వంటి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అంజిరాలో అధిక మోతాదులో పీచు,విటమిన్A, B1,B 2, మెగ్నీషియం,కాల్షియం వంటి ఖనిజాలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
బరువు పెరగటం అనేది ప్రస్తుతం అందరిని వేదిస్తున్న సమస్య. ఇలాంటి వారు అంజిరాను ఎంచుకొంటే మంచి పలితం కలుగుతుంది. కానీ ఎక్కువగా తింటే బరువు పెరుగుతాము. తక్కువగా పాలలో కలిపి తీసుకుంటే మంచిది. అంజిరా లో ఉండే పెక్టిన్ అనే పదార్దం కొవ్వును తగ్గించటానికి సహాయం చేస్తుంది.
అంజిరాలో ఉండే కొన్ని రకాల పోషకాలు మోనోఫాజ్ తర్వాత వచ్చే రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకోవటంలో కీలక పాత్రను పోషిస్తాయి. దీనిలో ఉండే పోటాషియం రక్తంలోని చక్కర నిల్వలను తగ్గిస్తుంది. అధిక ఒత్తిడి వలన వచ్చే రక్తపోటును కూడా తగ్గిస్తుంది.