Dizziness Symptoms:రెగ్యులర్‌గా కళ్ళు తిరుగుతున్నాయా.. ఈ మార్పులు తప్పనిసరి.. వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మందికి తరచుగా కానీ అప్పుడప్పుడు గాని తల తిరుగుతుంది. ఇందుకు ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచి పలితంకనపడుతుంది.
ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తక్కువ సార్లు తీసుకోవటం కన్నా తక్కువమోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవటం మంచిది. అలా చేసినప్పుడు జీవక్రియ సాఫీగా జరిగి రోజంతా శక్తి విడుదల అవుతుంది.
పుల్లగా ఉండే పండ్లను తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో తల తిరుగుతూ ఉండేవారు తప్పనిసరిగా రెండు బత్తాయి లేదా కమల కాయలు తీసుకోవాలి. అంతేకాక వారి దగ్గర నిమ్మకాయ ఉంచుకొని వాసన చూస్తూ ఉంటే తల తిరగటం మరియు వాంతి వచ్చే భావన ఉండవు.
ఆహారంలో ఐరన్ పుష్కలంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు,గుడ్లు తీసుకోవాలి. అయినప్పటికీ ఐరన్ లోపంతో భాదపడుతూ ఉంటే డాక్టర్ సలహాతో ఐరన్ మాత్రలు వాడాలి. శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే కనుక శరీరం ఐరన్ ని పిల్చుకోదు.అందువల్ల పుల్లని పండ్లను తీసుకోవాలి.
పని ఒత్తిడిలో ఉన్నా సరే సమయం ప్రకారం భోజనం తీసుకోవాలి. ఒకవేళ ఆ సమయంలో భోజనం చేయటం కుదరకపోతే ఒక పండు లేదా బలవర్ధకమైన చిరు తిండి తినాలి.