Hibiscus for hair: జుట్టు రాలడం, చుండ్రు తగ్గడానికి.. మందార ఇలా వాడండి.. జుట్టు పొడిబారటం, రాలిపోవటం, పెరుగుదల లేకపోవటం వంటి సమస్యలను మందార పూలతో పరిష్కారం చేసుకోవచ్చు. మందార పూలు, ఆకులు జుట్టు రాలడాన్ని తగ్గించి పోషకాలను అందిస్తాయి.
మాడుపై రక్త ప్రసరణను పెంచి జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. కొన్ని మందార పూలను తీసుకోని మెత్తగా చేసి, దానికి కొంచెం కొబ్బరి నూనె అమరియు కొంచెం నువ్వుల నూనెలను కలిపి మాడుకి, జుట్టుకు బాగా పట్టించి రెండు గంటల తర్వాత చన్నీళ్ళతో తలస్నానం చేయాలి.
ఇటువంటి సమయంలో తక్కువ ఘాడత కలిగిన షాంపూ లను మాత్రమే వాడాలి. మందార పూలతో షాంపూ ను కూడా తయారుచేయవచ్చు. రెండు లేదా మూడు మందార పూలను లేదా ఆకులను తీసుకోని మెత్తగా చేసి, దానికి కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ మరియు కొంత నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
మందార ఆకులను మెత్తగా చేసి,దానికి కొంచెం ఉసిరి పొడి, నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి, బాగా ఆరాక నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇది సహజసిద్దమైన షాంపూ గా పనిచేస్తుంది.