Joint Pains:భరించలేని కీళ్ళ నొప్పులు ఈ సూపర్ ఫుడ్స్ తో తగ్గుతాయి..ఈ మధ్య కాలంలో ముప్పైల్లో అడుగుపెట్టే మహిళల్లో వారి నోటి వెంట తరచుగా కీళ్ళ నొప్పులు అనే మాటను వింటున్నాం.
ఈ సమస్య రావటానికి కారణం కాలేజ్ కి వెళ్ళే వయస్సులో అమ్మాయిలు ఎముక బలానికి అవసరమైన కాల్షియంనుతీసుకోకపోవటం అని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.
తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. అయితే చక్కని పోషకాహారం తీసుకోవటంలో అమ్మాయిలు విఫలం అవుతున్నారు. అందుకే ఎదిగే వయస్సులో తగినంత కాల్షియం వారికీ అందటం లేదు.
కాల్షియం లోపించుట వలన చిన్న వయస్సులోనే కీళ్ళ నొప్పుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని కాల్షియం ఎక్కువగా లభించే రాగులు,నువ్వులు,పెరుగు,పాలు, పాలకూర, గుడ్డు వంటి ఆహారాలకు ఎక్కువ ప్రాదాన్యత ఇవ్వాలి. ఈ విధంగా చేయుట వలన కీళ్ళ నొప్పులు దగ్గరకు రాకుండా చేసుకోవచ్చు.