సహజంగా జుట్టు రంగును కాపాడుకోవటానికి హెన్నాను వాడతారు. దీనిని వాడటం వలన జుట్టుకు చాలా మేలు కలుగుతుంది. నెలకు రెండు సార్లు హెన్నా పెట్టుకొని తలస్నానం చేయుట వలన వెంట్రుకలు బలంగా పెరుగుతాయి. అంతేకాక జుట్టు మృదువుగా మారుతుంది. హెన్నాలో ఉసిరి పొడి కలిపి రెండు గంటలు నానబెట్టి జుట్టుకు రాసుకుటే చాలా మంచిది.
ఇది జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టులోని తేమను బయటకు పోకుండా చూస్తుంది. రసాయనాలు లేని సహజమైన గోరింటాకు పొడి జుట్టుకు మంచి ఎరుపు రంగును ఇస్తుంది. మరుగుతున్న నీటిలో రెండు స్పూన్ల ఉసిరి పొడి, ఒక స్పూన్ బ్లాక్ టీ, రెండు లవంగాలు వేయాలి. అలా కాచిన నీటిని వడకట్టి, ఆ నీటిలో హెన్నా పొడి కలపాలి.
దీనిని తలకు పట్టించి ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి. 3ఈ విధంగా చేస్తే జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. చుండ్రు సమస్య తగ్గాలంటే రెండు స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయం మెత్తని పేస్ట్ చేయాలి. దీనిలో కొంచెం గోరింటాకు పొడి, కొంచెం ఆవ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి గంట తర్వాత తల స్నానం చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.