చిన్న,పెద్ద ఎవరికైనా నీటిని చూస్తే తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. సాదారణంగా మహిళలు నడక,పరుగు,జిమ్ కి వెళ్ళటానికి ఆసక్తి చూపుతారు. కానీ ఈత కొట్టమంటే వెనకాడతారు. కానీ ఈత నేర్చుకొని రోజు చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
దాదాపు అరగంట సేపు ఈత కొడితే సుమారు 300 కేలరీలు ఖర్చు అవుతాయి. వారంలో కనీసం నాలుగు రోజులు ఈత కొట్టటానికి సమయం కేటాయిస్తే..... మూడు నాలుగు వారాల లోపే బరువు తగ్గటం ప్రారంభం అవుతుంది. ఈత కొట్టిన ప్రతిసారి కేలోరి కాలిక్యులేటర్ తో గమనిస్తే ఆ తేడా మీకే తెలుస్తుంది.
చన్నీటిలో ఈత కొట్టటం వలన రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. గుండెకు చక్కని వ్యాయామమ అందుతుంది. కాలి, వేలి కండరాలు దృడంగా తయారవుతాయి. ఒత్తిడి అదుపులో ఉంటుంది. అంతేకాక మెదడు చురుకుగా పనిచేస్తుంది. వెచ్చని నీటిలో ఈత కొట్టటం వలన శరీరానికి మర్దనా చేసిన అనుభూతి కలుగుతుంది. ఈత రాకుండా నీటిలోకి దిగకూడదు. నిపుణుల పర్యవేక్షణలో ఈత నేర్చుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.