Soar Throat Home Remedies: గొంతు మంటతో (sore throat) బాధపడుతున్నారా? ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలియడం లేదా? ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గొంతు మంటకు అనేక కారణాలు ఉండవచ్చు.
అలర్జీలు, సాధారణ జలుబు, ఫ్లూ, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రిక్ సమస్యలు, కాలుష్యం, చల్లని లేదా పొడి వాతావరణం, తగినంత నీరు తాగకపోవడం, పొగతాగడం, మద్యం సేవించడం, ఒత్తిడి వంటివి గొంతు మంటకు కారణమవుతాయి.
అయితే, సాధారణ గొంతు మంటను కొన్ని ఇంటి చిట్కాలతో సులభంగా నివారించవచ్చు:
1. తేనె మరియు నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్ తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోండి. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మరియు నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్లు గొంతు మంటను త్వరగా తగ్గిస్తాయి.
2. అల్లం కషాయం: ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ తాజా అల్లం తురుము, చిటికెడు పసుపు, అంగుళం దాల్చిన చెక్క వేసి బాగా మరిగించండి. ఈ నీటిని వడకట్టి, కొద్దిగా తేనె కలిపి తాగండి. రోజుకు ఒకసారి ఈ కషాయం తాగితే గొంతు మంట తగ్గుతుంది. అల్లం కషాయానికి బదులుగా గ్రీన్ టీ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
3. ఉప్పు నీటితో గార్గిల్: గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసి రోజుకు 2-3 సార్లు గార్గిల్ చేయండి. ఇది ఇన్ఫెక్షన్‌ను తగ్గించి, గొంతు మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
4. తగినంత నీరు తాగండి: డీహైడ్రేషన్ వల్ల గొంతు మంట మరింత తీవ్రమవుతుంది. కాబట్టి, రోజూ తగినంత నీరు తాగండి.
5. ఆహారంపై శ్రద్ధ: కారం, మిరియాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని నివారించండి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను మానేయండి.
ఈ సులభమైన చిట్కాలతో గొంతు మంట నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.