Veg Navratan Korma:నవరత్న కుర్మా.. ఇలా సులభంగా చేసేయండి..
కావలసిన పదార్ధాలు
ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు - 3 కప్పులు
(ఆలూ, కారెట్, పచ్చి బఠాణీ, బీన్స్, కాలిఫ్లవర్,
కాప్సికమ్, కాబేజ్, గోరు చిక్కుడు, సొరకాయ)
పనీర్ - 150 గ్రా. (తురిమినది)
టమాటాలు - 3
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగి)
అల్లం పేస్ట్ - 1 1/2 టీ స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 టీ స్పూన్లు
ఉప్పు - - 1 టీ స్పూను
కారం - 1 1/2 టీ స్పూన్లు
ధనియాలపొడి - 1 టీ స్పూను
గరం మసాలా పొడి - 2 టీ స్పూన్లు
మీగడ - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 6 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
పాలు/ నీళ్ళు - 1 కప్పు
డ్రై ఫ్రూట్స్ - 1/4 కప్పు
తగినంతపసుపు
కొత్తిమీర - అలంకరణకి
తయారి విధానం
ముందుగా టమాటాలను మెత్తగా అయ్యేవరకూ ఉడకించాలి. అవి చల్లారాక టమాటాల పై తొక్క తీసి గుజ్జు చేసుకోని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ ను సన్నని మంట మీద ఒక నిమిషం వేగించాలి. మరల బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.
ఇందులో ఉప్పు,కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి మూడు నిముషాలు వేగించాలి. అందులో పైన తయారుచేసుకున్న టమాటా గుజ్జు, డ్రై ఫ్రూట్స్‌ని వేయాలి. దీనిని కొంతసేపు ఉడికించాలి. ఇప్పుడు దీనిలో కొంచెం నీరు, పాలు పోసి ఒక పొంగు వచ్చాక, మంట తగ్గించి గ్రేవీ చిక్కగా అయ్యాక, దానిలో తురిమిన పనీర్ వేసి కలపాలి.
ఆ తర్వాత ఉడకబెట్టుకున్న కూరగాయల ముక్కలను ఆ గ్రేవీలో వేసి పది నిముషాలు ఉడికించాలి. దీనిని బౌల్ లోకి తీసుకోని మీగడ,కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఇది చపాతీలలోకి, నాన్‌లలోకి మంచి కాంబినేషన్.