Stuffed Tomato Recipe - స్టఫ్డ్ టమాటోస్.. ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుంది..
కావలసిన పదార్ధాలు
మీడియం సైజ్ టమాటాలు - 5-6
పనీరు తురుము - 100-150 గ్రా.
ఉల్లిపాయ - 1 సన్నగా తరిగి
కొత్తిమీర - సన్నగా తరిగి
పచ్చి మిర్చి - 2 సన్నగా తరగాలి
ఉప్పు - తగినంత
కారం - తగినంత
గరం మసాలా - తగినంత
పసుపు - 1/4 టీ స్పూన్
చీజ్ తురుము - 1 టేబుల్ స్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం
టమాటాలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. టమాటా పై భాగంలో ఉండే తొడిమను గుండ్రంగా కట్ చేయాలి. ఆ తర్వాత టమాటా మధ్యలో ఉన్న మొత్తం పదార్ధాన్ని జాగ్రత్తగా బయటకు తీయాలి. దీన్ని పక్కన పెట్టాలి. టమాటా పైన తీసిన భాగాన్ని ముక్కలుగా కోయాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి అది వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు ,పచ్చి మిర్చి ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యే వరకూ వేగించాలి.
ఆ తర్వాత టమాటా నుంచి తీసిన గుజ్జు, టమాటా ముక్కలను వేసి కొంచెం వేగాక గరం మసాలా, ఉప్పు,కారం, పసుపు వేయాలి. తర్వాత పనీరు తురుము వేసి ఒక నిమిషం వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని టమాటాల్లో నింపి,దానిపై కొత్తిమీర, తురిమి పెట్టుకున్న చీజ్ వేయాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ ప్లేట్‌లో పెట్టి దాని పై కొంచెంవెన్న వేసి ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించాలి. దీనిని వేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటుంది.