Face scrubs for Glowing skin: తేనెలో ఇది మిక్స్ చేసి స్క్రబ్ చేస్తే.. టాన్, మృతకణాలు తొలగుతాయి..మీ ముఖం కాంతి లేకుండా పేలవంగా ఉందా? అయితే మీరు మీ ముఖానికి ఈ స్క్రబ్స్ లను ఉపయోగించండి.
తేనే
ముఖం పేలవంగా కనిపిస్తే చర్మం పై మృత కణాలు ఎక్కువగా ఉన్నాయని అర్ధం. వీటిని తొలగించటానికి తేనెలో కొంచెం పంచదార వేసి ముఖానికి,మెడకు పట్టించి కొంతసేపు మర్దనచేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే చర్మం తాజాగా మారుతుంది.
చింతపండు
నీటిలో నానబెట్టి పిండేసిన చింతపండు గుజ్జు తో ముఖాన్ని రుద్దుకున్న చర్మంపై మృత కణాలు తొలగిపోతాయి.
నిమ్మ
నిమ్మలో ఉండే ఆమ్ల గుణాలు నలుపుదనాన్ని తగ్గించటంలో ముందు ఉంటాయి. నిమ్మరసాన్ని కళ్ళ చుట్టూ తప్పించి ముఖం అంతా రాసి పావుగంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసానికి కొంచెం తేనే,పెరుగు కలిపినా మంచి పలితం ఉంటుంది.
పాల మీగడ
పాల మీగడ,శనగపిండి, పసుపు కలిపి ముఖానికి రాయాలి. ఒక పావుగంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.