Gobi Manchurian Recipe :గోబీ మంచురియా పక్కా రెస్టారెంట్ రుచి రావాలంటే ఇలా చేయండి
కావలసిన పదార్దాలు
క్యాలీఫ్లవర్ గుత్తులు (పువ్వులు) - 1 కప్పు,
మైదాపిండి - అరకప్పు
మొక్కజొన్న పిండి - అరకప్పు,
గుడ్డు - 1, మిరియాల పొడి- 1 స్పూన్
అజినమోటో - చిటికెడు,
ఫుడ్ కలర్ - చిటికెడు,
ఉప్పు - తగినంత
వెల్లుల్లి ముక్కలు - 1 స్పూన్,
కరివేపాకు - 3 రెమ్మలు,
ఉల్లికాడలు - 4
నూనె - వేయించడానికి సరిపడా
తయారి విధానం
క్యాలీఫ్లవర్ పువ్వులను వేడి నీటిలో వేసి ఐదు నిమిషాలు అయ్యాక తీయాలి. ఒక బౌల్ లో మైదాపిండి, మొక్కజొన్న పిండి, గుడ్డు, ఉప్పు, మిరియాలపొడి, ఫుడ్ కలర్, అజినమోటో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి కలపాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక పైన తయారుచేసుకున్న మిశ్రమాన్ని పకోడీ మాదిరిగా వేగించాలి.
మరొక బాణలిలో రెండు స్పూన్లు నూనె వేసి వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లికాడ ముక్కలు,కరివేపాకు వేసి వేగించాలి. అందులో వేగించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి బాగా కలపాలి. పొడిగా తినాలని అనుకుంటే అలాగే తినొచ్చు. ముక్కలు కొంచెం మెత్తగా ఉండాలని అనుకుంటే సోయాసాస్ కలిపితే సరి. అంతే వేడి వేడిగా గోబీ మంచూరియా రెడీ.