Chilli Mashroom Recipe:చిల్లీ మష్రూమ్స్ ఎలా తయారు చేయాలో తెలుసా?
కావలసిన పదార్థాలు
మష్రూమ్స్ (పుట్టగొడుగులు) - పావుకేజీ
నూనె - రెండు టేబుల్ స్పూన్లు,
ఉల్లి కాడలు - 4
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి - 4, ఉప్పు - తగినంత
టమాటా సాస్ - 1 టేబుల్ స్పూన్
పంచదార - 1 టీ స్పూన్,
చిల్లీ సాస్ - 1 టేబుల్ స్పూన్
సోయాసాస్ - 2 టేబుల్ స్పూన్లు
తయారు చేసే విధానం
పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. అది కొంచెం వేగాక ఎండుమిర్చి వేసి వేగించాలి. తర్వాత మష్రూమ్స్ వేసి పది నిముషాలు సన్నని మంటపై వేగించాలి.
ఆ తర్వాత సోయాసాస్, చిల్లీ సాస్,టమాటా సాస్, పంచదార,ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ విధంగా ఐదు నిముషాలు ఉంచి పొయ్యి మీద నుంచి దించేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిపై ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేస్తే చిల్లీ మష్రూమ్స్ రెడీ.