ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచుతుందని అందరికీ తెలుసు. అయితే, చాలామంది గంటల తరబడి ధ్యానం చేయడానికి సమయం లేదా ఓపిక లేదని అంటారు. కానీ, నిపుణుల ప్రకారం, ధ్యానం కోసం గంటలు కేటాయించాల్సిన అవసరం లేదు.
రోజూ కేవలం 5 నిమిషాల ధ్యానం చాలు. ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
రోజూ ధ్యానం చేయడం వల్ల గొప్ప ఫలితాలు పొందవచ్చు. ధ్యానం అనేది ప్రాచీన సంప్రదాయాల్లో భాగమైన ఆధ్యాత్మిక అభ్యాసం. రోజూ 5 నిమిషాల ధ్యానం మనసు, శరీరం, ఆత్మలను సమన్వయం చేస్తుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఆత్మతో లోతైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది.
5 నిమిషాల ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు
• అధ్యయనాల ప్రకారం, ధ్యానం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 2 నెలల పాటు రోజూ 5 నిమిషాల ధ్యానం చేసిన వారిలో రోగనిరోధక శక్తి మెరుగుపడింది. ఇన్ఫ్లమేషన్ తగ్గడం, వ్యాధిగ్రస్త కణాలు నశించడం, క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే జన్యువులు చురుగ్గా పనిచేయడం ప్రారంభమవుతాయి.
• మంచి నిద్ర కోసం ధ్యానం సహాయపడుతుంది. 6 రోజుల్లోనే ధ్యానం ఫలితాలు కనిపిస్తాయి. రోజూ ధ్యానం చేయడం వల్ల నిద్రలేమి, అలసట, డిప్రెషన్ తగ్గుతాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
• ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు నొప్పిని నియంత్రిస్తుంది. తలనొప్పి, నడుంనొప్పి, ఛాతినొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు ఉన్నవారికి ధ్యానం ఉపయోగకరం.
• ధ్యానం రక్తపోటును తగ్గిస్తుంది. రోజూ ధ్యానం చేయడం మందులు వాడడం కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
• ధ్యానం మెదడును చురుగ్గా ఉంచుతుంది, మనసును ప్రశాంతంగా చేస్తుంది మరియు ఏకాగ్రతను పెంచుతుంది.
• ధ్యానం నిర్ణయాలు తీసుకునే ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌ను బలోపేతం చేస్తుంది.
• ధ్యానం పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది.
5 నిమిషాల ధ్యానం ఎలా చేయాలి?
ధ్యానం కోసం ముందుగా 5 నిమిషాల సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రశాంతమైన, శుభ్రమైన ప్రదేశంలో కూర్చోవాలి. కళ్లు మూసుకుని, శ్వాసపై దృష్టి పెట్టాలి. ‘ఓం’ లేదా శాంతి మంత్రాన్ని జపించవచ్చు.
ఈ ధ్యానాన్ని ఉదయం మాత్రమే కాకుండా, మధ్యాహ్నం లేదా సాయంత్రం కూడా చేయవచ్చు. ఒత్తిడి అనిపించినప్పుడు 5 నిమిషాల ధ్యానం చేస్తే, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

