కావలసిన పదార్థాలు:
- నూనె - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - ½ టీస్పూన్
- ధనియాలు - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 10 (లేదా రుచికి తగినన్ని)
- ఎండుమిర్చి - 4
- వెల్లుల్లి రెబ్బలు - 5
- క్యాబేజీ తరుగు - 150 గ్రాములు (సన్నగా తరిగినది)
- పసుపు - ¼ టీసను
- చింతపండు - ఉసిరికాయంత
- టమాట - 3
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
1. స్టవ్ ఆన్ చేసి కడాయి వేడి చేయండి. నూనె పోసి జీలకర్ర, ధనియాలు వేసి వేయించండి.
2. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వండి.
3. ఇవి వేగిన తర్వాత క్యాబేజీ తరుగు, పసుపు వేసి కలపండి. మూత పెట్టి క్యాబేజీ మెత్తగా ఉడికే వరకు మగ్గనివ్వండి.
4. క్యాబేజీ ఉడికిన తర్వాత చింతపండు, టమాట ముక్కలు వేసి మీడియం మంటపై కలుపుతూ టమాట మెత్తగా అయ్యే వరకు ఉడికించండి.
5. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
6. మరోసారి కడాయిలో నూనె వేసి వేడి చేయండి. తాళింపు దినుసులు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించండి.
7. వేగిన తాళింపులో గ్రైండ్ చేసిన పచ్చడిని వేసి బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేయండి. రుచికరమైన క్యాబేజీ పచ్చడి సిద్ధం!