mokkajonna garelu:మొక్కజొన్న వడలు ఇలాచేయండి క్రిప్సిగా ఉంటాయి

కావలసిన పదార్థాలు:

- నానబెట్టిన మొక్కజొన్న గింజలు - 2 కప్పులు
- ఎండుమిర్చి - 2
- పచ్చిమిర్చి - 2
- ఉప్పు - రుచికి సరిపడా
- అల్లం - అర ఇంచు ముక్క
- వెల్లుల్లి రెబ్బలు - 4
- జీలకర్ర - అర టీస్పూన్
- శనగపిండి - 1 టేబుల్ స్పూన్
- బియ్యం పిండి - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
- పుదీనా - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
- ధనియాల పొడి - అర టీస్పూన్
- గరం మసాలా - పావు టీస్పూన్
- చాట్ మసాలా - పావు టీస్పూన్
- పసుపు - చిటికెడు
- నూనె - డీప్ ఫ్రై కోసం

తయారీ విధానం:
1. నానబెట్టిన మొక్కజొన్న గింజలను వడకట్టి, మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
2. దీనిలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి మెత్తగా రుబ్బుకోవాలి. ఉప్పు అంతా కలిసేలా 5 నిమిషాలు పక్కన ఉంచాలి.
3. తర్వాత నూనె తప్ప మిగిలిన అన్ని పదార్థాలను ఈ మిశ్రమంలో కలిపి బాగా మెదపాలి.
4. కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
5. నూనె వేడయ్యాక, పిండిని కొద్దిగా తీసుకొని చేతితో గారెల ఆకారంలో ఒత్తి, నూనెలో వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి.
6. ఈ విధంగా చేస్తే క్రిస్పీగా, రుచిగా ఉండే మొక్కజొన్న గారెలు సిద్ధం!
7. గారెలు మరీ మందంగా లేదా పలుచగా కాకుండా మధ్యస్థంగా వత్తుకోవాలి.

గమనికలు:
1. లేత మొక్కజొన్న గింజలు తీసుకుంటే గారెలు మెత్తగా, రుచిగా వస్తాయి.
2. పిండిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా రుబ్బితే, తినేటప్పుడు మొక్కజొన్న రుచి బాగా తెలుస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top