మనం తినేందుకు అనేక రకాల నట్స్ అందుబాటులో ఉన్నాయి. నట్స్ అనగానే చాలా మంది వాల్‌నట్స్, బాదం, జీడిపప్పు, పిస్తాలను గుర్తుంచుకుంటారు. అయితే, నట్స్‌లో ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్రెజిల్ నట్స్ ఒకటి. ఇవి ఇతర నట్స్‌తో పోలిస్తే సైజులో కాస్త పెద్దగా ఉంటాయి.
రోజుకు కేవలం 3 బ్రెజిల్ నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ నట్స్ ప్రస్తుతం మార్కెట్లో సులభంగా దొరుకుతున్నాయి. ప్రముఖ మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్లలో బ్రెజిల్ నట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని రాత్రి నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం అల్పాహారంలో భాగంగా తినాలి. ఇలా రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ల ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
థైరాయిడ్ సమస్యలకు పరిష్కారం..
బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. రోజూ మూడు నట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన సెలీనియం కంటే ఎక్కువగానే లభిస్తుంది. సెలీనియం శరీరంలో జీవక్రియలను సక్రమంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.
ఇది శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు లేదా థైరాయిడ్ మాత్రలు వాడుతున్నవారు రోజూ బ్రెజిల్ నట్స్ తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి సమర్థవంతంగా పనిచేస్తుంది.
దీని ఫలితంగా జీవక్రియలు మెరుగవుతాయి, మెటబాలిజం పెరుగుతుంది, క్యాలరీలు ఖర్చవుతాయి, కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతుంది. థైరాయిడ్ సమస్యలకు బ్రెజిల్ నట్స్ ఒక వరంగా పనిచేస్తాయి.
రోగ నిరోధక శక్తిని పెంచడానికి..
బ్రెజిల్ నట్స్‌లో విటమిన్ ఇ, ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి, ఇవి యాంటీ-ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇవి శరీరంలో అవసరమైన ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహాయపడతాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది,
శరీరంలోని వాపులు తగ్గుతాయి, గుండె వాపుల నుంచి రక్షణ కలుగుతుంది. ఇది హార్ట్ ఎటాక్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది. సెలీనియం రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి శరీరంలో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు చేరకుండా కాపాడతాయి, రోగాల నుంచి రక్షణనిస్తాయి.
గుండె ఆరోగ్యానికి..
బ్రెజిల్ నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతాయి.
దీని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి, హార్ట్ ఎటాక్ నుంచి రక్షణ కలుగుతుంది. షుగర్ సమస్య ఉన్నవారికి బ్రెజిల్ నట్స్ చక్కటి ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలోని యాంటీ-ఆక్సిడెంట్లు, ఫైబర్ రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తాయి,
డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి. ఉదయం బ్రెజిల్ నట్స్ తినడం వల్ల రోజంతా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి, నీరసం, అలసట రాకుండా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ ఆహారంలో బ్రెజిల్ నట్స్‌ను చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.