సాధారణంగా డిటాక్స్ అంటే లివర్, కిడ్నీలు లేదా జీర్ణవ్యవస్థ అని భావిస్తాం. అయితే, చర్మానికి కూడా డిటాక్స్ చాలా అవసరం. చర్మం మీదే ఎక్కువగా దుమ్ము, ధూళి పేరుకుంటాయి.
రోజూ స్నానం చేసినా, సబ్బు వాడినా చర్మంలోని మురికి పూర్తిగా తొలగదు. చర్మ కణాల్లో దాగి ఉండే బ్యాక్టీరియా అలాగే ఉంటుంది మరియు అది కొన్నిసార్లు వ్యాపిస్తుంది. దీని వల్ల దద్దుర్లు, మొటిమలు, జిడ్డుదనం వంటి సమస్యలు తలెత్తుతాయి, ముఖ్యంగా ముఖంపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ సమస్యలను నివారించాలంటే చర్మ డిటాక్స్ తప్పనిసరి. మార్కెట్‌లో రకరకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఒక న్యూట్రిషనిస్ట్ సహజమైన, సులభమైన చిట్కాను సూచించారు. ఈ డిటాక్స్ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలో చూద్దాం.
స్కిన్ డిటాక్స్
చర్మంపై దుమ్ము బ్యాక్టీరియా పేరుకుపోతాయి. సబ్బుతో స్నానం చేస్తే ఉపరితలంపై ఉన్న దుమ్ము మాత్రమే తొలగుతుంది, కానీ చర్మ కణాల్లో దాగి ఉన్న మురికి అలాగే ఉంటుంది. దీన్ని తొలగించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి, కానీ ఒక న్యూట్రిషనిస్ట్ సులభమైన, సహజమైన డిటాక్స్ డ్రింక్‌ను సూచించారు. ఈ డ్రింక్ తయారీకి కావాల్సినవి కేవలం రెండు పదార్థాలు మాత్రమే. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, ముడతలు, రంగు తగ్గిన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
కావాల్సిన పదార్థాలు
- రోజా పూల రేకలు (ఎండబెట్టినవి) - 1 టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
- వేడి నీరు- 1.5 కప్పులు
రోజా పూల రెక్కల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. దాల్చిన చెక్క చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రెండింటి కలయిక చర్మానికి రెట్టింపు ప్రయోజనాలను అందిస్తుంది.
తయారీ విధానం
1. 1.5 కప్పుల నీటిని బాగా మరిగించండి.
2. మరుగుతున్న నీటిలో ఎండబెట్టిన రోజా పూల రెక్కలను వేయండి.
3. బాగా కలిపిన తర్వాత దాల్చిన చెక్కను జోడించండి.
4. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు అలాగే ఉంచండి.
5. గోరువెచ్చగా ఉన్నప్పుడు వడబోసి తాగండి.
ఏలా ఉపయోగించాలి
- ఈ డ్రింక్‌ను ఉదయం పరగడుపున లేదా రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితాలు వస్తాయి.
- 21 రోజుల పాటు రోజూ ఒక కప్పు తాగండి.
- ఆ తర్వాత 7-10 రోజులు విరామం ఇవ్వండి, మళ్లీ 21 రోజులు కొనసాగించండి.
- జాగ్రత్తలు:
- గర్భిణీలు ఈ డ్రింక్ తాగకూడదు. వైద్యుల సలహా తీసుకోవాలి.
- రోజా పూలు లేదా దాల్చిన చెక్కకు అలెర్జీ ఉన్నవారు దీన్ని నివారించాలి.
- రక్తపోటు లేదా డయాబెటిస్ మందులు తీసుకునేవారు కూడా దీన్ని ఉపయోగించకపోవడం మంచిది.
ఎలా పనిచేస్తుంది
- రోజా పూల రేకలు : ఇందులో ఉండే పాలీఫినాల్స్ మరియు విటమిన్ సి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యవంతంగా చేస్తాయి.
- దాల్చిన చెక్క: రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, చర్మ కణాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది, బ్యాక్టీరియాను తొలగిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
ఈ సహజమైన డిటాక్స్ డ్రింక్‌తో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అది కూడా ఖర్చు లేకుండా సులభంగా!