Sleep Disruption Foods:రాత్రి సమయలో సరిగా నిద్ర పట్టటం లేదా.. ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.. నేటి జీవనశైలి కారణంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తగ్గిపోయింది, దీంతో అనవసరమైన ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
ముఖ్యంగా నిద్రలేమి సమస్య నీటి తరం ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఒకటి. కనీసం నిర్దిష్ట గంటల కంటే తక్కువ నిద్రపోతే, శరీరంలో వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఈ సమస్యకు మనం తీసుకునే ఆహారం కూడా ఒక ముఖ్య కారణం. అందువల్ల, రాత్రి సమయంలో గాఢ నిద్ర కోసం కొన్ని ఆహారాలను తప్పనిసరిగా నివారించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఆహారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
మాంసాహారం
మాంసంలో కొవ్వు మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే రాత్రి సమయంలో మాంసాహారం తినడం మానుకోవాలి. ఎంత ఇష్టమైనా, రాత్రి భోజనంలో మాంసాహారాన్ని పూర్తిగా నివారించడం మంచిది.
కారంగా ఉండే ఆహారం
కారంగా ఉండే ఆహారం తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. రాత్రి సమయంలో కారం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది మరియు అసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది.
కాఫీ లేదా టీ
చాలా మంది రాత్రి భోజనం తర్వాత కాఫీ లేదా టీ తాగే అలవాటు కలిగి ఉంటారు. అయితే, కాఫీలో ఉండే కెఫిన్ నిద్రలేమి సమస్యను తీవ్రతరం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా, టీ ఆకులలో కూడా కెఫిన్ ఉంటుంది, ఇది నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి, పడుకునే ముందు కాఫీ లేదా టీ తాగడం మానేయడం ఉత్తమం.
జంక్ ఫుడ్
జంక్ ఫుడ్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి, ఇవి సులభంగా జీర్ణం కావు. రాత్రి సమయంలో జంక్ ఫుడ్ తినడం వల్ల నిద్ర భంగం కావడంతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
రాత్రి సమయంలో ఈ ఆహారాలను నివారించడం ద్వారా గాఢ నిద్రను పొందవచ్చు మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.