Red Foods:ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తింటున్నారా.. తినకపోతే.. ఎరుపు రంగు ఆహారాలను తరచూ తినమని ఆహార నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఈ ఆహారాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉత్పత్తియ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి,
దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఇది కణాలకు జరిగే నష్టాన్ని, వాపులను తగ్గించి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండి, హార్ట్ ఎటాక్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎరుపు రంగు ఆహారాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి.
వీటిలోని విటమిన్ సి, లైకోపీన్ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి మరియు చర్మ కణాలను డ్యామేజ్ నుంచి కాపాడతాయి, దీంతో యవ్వనంగా కనిపిస్తారు. ఈ ఆహారాల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తం ఉత్పత్తి అవుతుంది,
రక్తహీనత తగ్గుతుంది, నీరసం, అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎరుపు రంగు ఆహారాలను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలున్నవారు వీటిని అనుసరించే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.