Stretch marks: ఈ ఆయిల్ రాస్తే.. స్ట్రెచ్ మార్క్స్ మాయం అవుతాయ్.. స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించడానికి చాలా మంది మహిళలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ఈ మచ్చలు అస్సలు పోవు. అయితే, రోజూ జుట్టుకు ఉపయోగించే కొబ్బరి నూనెతో ఈ స్ట్రెచ్ మార్క్స్ సులభంగా తొలగిపోతాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రెచ్ మార్క్స్ చాలా మందికి ఉంటాయి, ఇవి కేవలం మహిళలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా ఏర్పడతాయి. ఇవి పొట్ట, చేతులు, శరీరంలోని ఇతర భాగాల్లో కనిపిస్తాయి. ఈ మచ్చల వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు, ఇష్టమైన దుస్తులను ధరించలేకపోతారు. అందుకే వీటిని తొలగించడానికి అనేక ప్రయత్నాలు, ఖరీదైన క్రీములను ఉపయోగిస్తారు. అయినా, ఈ మచ్చలు పోవు. కొబ్బరి నూనె రాస్తే స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా తొలగిపోతాయని కొందరు భావిస్తారు. ఈ విషయంలో నిజం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చర్మం వేగంగా విస్తరించినప్పుడు, బరువు ఎక్కువగా పెరిగినప్పుడు, గర్భధారణ సమయంలో, యుక్తవయసులో లేదా బరువులు ఎత్తడం వంటి కారణాల వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయి. ఈ కారణాల వల్ల చర్మం లోపలి పొరలు కొద్దిగా చిరిగి స్ట్రెచ్ మార్క్స్‌గా మారతాయి.
కొబ్బరి నూనె చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది మరియు మంచి పోషణను అందిస్తుంది. అలాగే, చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, కొబ్బరి నూనె స్ట్రెచ్ మార్క్స్‌ను పూర్తిగా తొలగించదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, ఈ మచ్చలు చర్మం లోపలి పొరల నుంచి ఏర్పడతాయి. కాబట్టి, కొబ్బరి నూనెతో స్ట్రెచ్ మార్క్స్ పోతాయనేది పొరపాటు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ కొత్త మచ్చలు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడవచ్చు.
స్ట్రెచ్ మార్క్స్‌ను పూర్తిగా తొలగించాలంటే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అయితే, వీటిని తగ్గించడానికి కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు కావాలనుకుంటే వీటిని ప్రయత్నించవచ్చు.
మైక్రోనీడ్లింగ్‌తో పీఆర్పీ, మార్ఫియస్ 8, ఫ్రాక్షనల్ లేజర్ వంటి చికిత్సల ద్వారా స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించవచ్చు. ఈ చికిత్సలను వీలైనంత త్వరగా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.