Zodiac signs:సెప్టెంబర్‌లో అదృష్టం వీరిదే... నక్కతోక తొక్కినట్టు.. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల కలయిక, నక్షత్రాల్లో గ్రహాల ప్రయాణం, రాశుల మార్పు సహజం. కొన్ని గ్రహాలు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతాయి, మరికొన్ని రెండు లేదా మూడు నెలలకు ఒకసారి సంచారం చేస్తాయి. త్వరలో శుక్ర గ్రహం రాశి మార్పు చేయనుంది. ఈ సంచారం 12 రాశులపై ప్రభావం చూపనుంది, కానీ నాలుగు రాశుల వారికి మాత్రం అదృష్టం తప్పక కలిసి వస్తుంది.
శుక్ర గ్రహం సంపద, సుఖం, శ్రేయస్సుకు ప్రతీక. సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి సొంత ఇల్లు కొనుగోలు చేసే కల నెరవేరడమే కాకుండా, చేపట్టిన పనులన్నీ విజయవంతం కానున్నాయి. ఆ రాశులు ఏవో చూద్దాం:
వృషభ రాశి: వృషభ రాశి వారికి శుక్రుడి సంచారంతో సెప్టెంబర్ నెల అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు చేసే ఏ పనైనా సఫలమవుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇంట్లో, బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా లాభాలు చేకూరతాయి.
మిథున రాశి: మిథున రాశి వారికి చేపట్టిన పనులన్నీ బంగారంలా మారనున్నాయి. సెప్టెంబర్‌లో ఊహించని లాభాలు అందుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. స్థిరాస్తుల కొనుగోలుకు అవకాశం ఉంది. వ్యాపారస్తులకు బహుళ లాభాలు వస్తాయి. పెట్టుబడులు అనుకూల ఫలితాలనిస్తాయి.
కన్యా రాశి: కన్యా రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పిల్లల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంతో సంతోషమైన క్షణాలు గడుపుతారు.
మేష రాశి: మేష రాశి వారికి ఊహించని దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.